అగ్రరాజ్యం అమెరికా దివాలా అంచుల్లో ఉందా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అసలే ఆర్ధిక సంక్షోభంలో కొట్టుకుంటున్న అమెరికా ప్రభుత్వం దాదాపు దివాలా తీసినట్లే అనిపిస్తోంది. అమెరికా చేసిన అప్పులు తీర్చుకోలేని స్ధాయికి చేరుకున్నాయి. 2021 లెక్కల ప్రకారమే అమెరికా అప్పు 28.5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. తర్వాత జరిగిన పరిణామాల్లో మరింత అప్పులు చేసింది. ఇపుడా అప్పులే తడిసిమోపడవటంతో తీర్చలేక చతికిలి పడింది.
అప్పుపరిమితి పెంచుకునేందుకు డెమాక్రట్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు రిపబ్లికన్లు అడ్డుకున్నారు. దాంతో ఎక్కడిబిల్లులు అక్కడే ఆగిపోయాయి. ఈనెలాఖరులోగా రిపబ్లికన్లు తమ నిర్ణయాన్ని మార్చుకుని పార్లమెంటులో అప్పుపరిమితి పెంచుకునేందుకు అనుమతి ఇవ్వకపోతే అమెరికా దివాలా తీసినట్లే అనుకోవాలి. ఆదాయానికి మించి ప్రభుత్వానికి ఖర్చులు పెరిగిపోయినపుడు అప్పులు చేయకతప్పదు.
అప్పుల కోసం ప్రభుత్వాలు హామీగా బాండ్లను జారీచేస్తాయి. నిర్దిష్ట సమయానికి అప్పులు తీర్చటంతో పాటు వడ్డీలను కూడా చెల్లిస్తామని ఇచ్చే హామీయే బాండ్లజారి. ఇపుడు అమెరికా జారీచేసిన బాండ్లు కూడా పరిమితికి మించిపోయాయి.
అందుకనే దేశం దివాలా తీసిందని రిపబ్లికన్లు గోలమొదలుపెట్టారు. అందుకనే అప్పు పరిమితి పెంచటానికి తాము ఆమోదించేది లేదని తెగేసి చెబుతున్నారు. దాంతో ఏమిచేయాలో అధ్యక్షుడు జో బైడెన్ కు దిక్కుతోచటంలేదు. ముందుజాగ్రత్తగా బిల్లుల చెల్లింపులను ప్రభుత్వం నిలిపేసింది.
అయితే ప్రభుత్వ ఖజనాలో ఉన్న డబ్బు, పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని మాత్రమే ప్రభుత్వం ఖర్చు చేయగలుగుతుంది. ఉన్న డబ్బు, వచ్చే ఆదాయం చెల్లించాల్సిన అసలు, వడ్డీ, ఇతర బిల్లుకు సరిపోతుంది. మరి కొత్తగా చేయాల్సిన ఖర్చులు, అభివృద్ధి మాటేమిటి ? అన్నదే ఇపుడు బైడెన్ను బాగా వేధిస్తోంది.
ఈ కారణంగానే ఆస్ట్రేలియా పర్యటనను కూడా బైడెన్ వాయిదా వేసుకున్నారు. ఎప్పుడైతే ప్రభుత్వం అప్పులు, వడ్డీలు కట్టలేక, బిల్లులను చెల్లించలేని పరిస్ధితికి చేరుకుంటుందో అప్పుడు దివాలా తీసినట్లు లెక్క. ఇపుడు అమెరికా ప్రభుత్వం అదే స్ధితికి చేరుకుంది. జూన్ 1వ తేదీలో అప్పుల పరిమితిని సవరిస్తు పెంచకపోతే అమెరికా ప్రభుత్వం దివాలా తీసినట్లు ప్రకటించాల్సొస్తుంది.