సంచలనంగా మారింది నిమ్స్ వైద్యుడి సూసైడ్ ఉదంతం. వృత్తి పట్ల నిబద్ధత.. సబ్జెక్ట్ విషయంలో టాలెంట్.. వాటన్నింటికి మించి లక్షల్లో ఒకరిద్దరికి మాత్రమే ఉండే వ్యక్తిత్వం.. లాంటి ఎన్నో పొగడ్తలు అతని గురించి చెబుతారు అలాంటి ఆయన.. ఏ కష్టం వచ్చిందో ఏమో కానీ.. నిమ్స్ ఆసుపత్రిలో తనకు కేటాయించిన గదిలో ఆత్మహత్య చేసుకున్న వైనం సంచలనంగా మారింది.
త్వరలోనే అతడికి పెళ్లి చేయాలని భావిస్తున్న కుటుంబ సభ్యులకు తీవ్ర విషాదాన్ని మిగులుస్తూ .. తన రూంలో ఊరి వేసుకున్న వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒక డాక్టర్.. అందునా బోలెడంత టాలెంట్ తో పాటు.. నలుగురికి సాయం చేయాలన్న మైండ్ సెట్ ఉన్న వైద్యుడి ఆత్మహత్య ఉదంతంలోకి వెళితే..
నిమ్స్ లో న్యూరో విభాగంలో డీఎం కోర్సు చేస్తున్నాడు శివతేజారెడ్డి. పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన శివతేజారెడ్డి.. ఇప్పటికే ఆంధ్రా మెడికల్ కాలేజీలో జనరల్ మెడిసిన్ విభాగంలో ఎండీ కోర్సు చేశారు. అనంతరం నిమ్స్ సెట్ రాసి న్యూరాలజీ మూడు సంవత్సరాల సూపర్ స్పెషాలిటీ కోర్సుకు సీటు సంపాదించారు.
శివతేజారెడ్డి హైదరాబాద్ కు వచ్చేయటంతో ఆయన తల్లిదండ్రులు అమెరికాలోని తమ కుమార్తె ఇంటికి వెళ్లారు. గడిచినకొంతకాలంగా స్నేహితుడి రూంలో ఉంటూ నిమ్స్ లో విధులు నిర్వర్తిస్తున్న శివతేజా రెడ్డి.. ఇటీవల నిమ్స్ లోని డాక్టర్స్ క్లబ్ లో 317 గదికి షిఫ్ట్ అయ్యారు.
ఇదిలా ఉంటే శనివారం రాత్రి 12 గంటల వరకూ ఆసుపత్రిలో విధులు నిర్వర్తించారు. అనంతరం రూంకి వెళ్లిన ఆయన.. ఆదివారం ఉదయం ఆరున్నర గంటలకు విధులకు రావాల్సి ఉంది. కానీ.. రాకపోవటంతో తోటి డాక్టర్లు ఆయన రూంకి వెళ్లారు. ఎంత కొట్టినా తలుపు తీయకపోవటంతో కిటికీలో నుంచి చూడగా.. ఫ్యాన్ కు ఉరి వేసుకున్న వైనంతో షాక్ కు గురయ్యారు.
ఈ సమాచారాన్ని పోలీసులకు అందించారు. ఆసుపత్రి వర్గాల సమాచారం ప్రకారం.. గడిచిన వారంగా శివతేజారెడ్డి ముభావంగా ఉన్నారని చెబుతున్నారు. ఎలాంటి కారణాన్ని చెప్పలేదని.. ఒంటరితనంతోనే ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. త్వరలోనే శివతేజారెడ్డి వివాహం చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. శివతేజారెడ్డి ఆత్మహత్య గురించి తెలుసుకున్న పిన్ని సరస్వతి బోరుమన్నారు. ఈ రోజు (సోమవారం) అమెరికాలో ఉన్న శివతేజారెడ్డి తల్లిదండ్రులు హైదరాబాద్ కు వస్తారని చెబుతున్నారు. ప్రస్తుతం నిమ్స్ మార్చురీలో భౌతికకాయాన్ని ఉంచారు. సోమవారం పోస్ట్ మార్టం నిర్వహిస్తారని చెబుతున్నారు. డాక్టర్ శివతేజా రెడ్డి ప్రత్యేక ఏమిటంటే.. ఎవరైనా పేదలు ఆసుపత్రికి వస్తే వారికి అవసరమైన మందులకు డబ్బులు లేకున్నా.. వైద్య అవసరాల కోసం ఆర్థిక సాయాన్ని అందిస్తుంటారని.. అందరితో ఎంతో చక్కగా ఉండే శివ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటూ పలువురు వేదన చెందుతున్నారు.