గోమాంస వ్యాపారుల్లో హిందువులే 95 శాతం!

Update: 2015-11-21 08:57 GMT
బీహార్ ఎన్నికల సందర్భంగా దేశ వ్యాప్తంగా గోవధ.. పరమత అసహనం లాంటి అంశాల మీద భారీగానే చర్చ సాగింది. ఈ సందర్భంగా బీజేపీ.. మిగిలిన పార్టీల మధ్య వాద.. ప్రతివాదనలు చోటు చేసుకోవటం తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు మేధావులు దేశంలోజరుగుతున్న మత అసహనానికి వ్యతిరేకంగా తమకు ప్రభుత్వం ఇచ్చిన పురస్కారాల్ని వెనక్కి ఇచ్చేశారు.

ఇదిలా ఉండగా.. గోవధ.. పరమత అసహనం లాంటి అంశాల మీద చర్చ ఒక్కసారిగా ఆగిపోయింది. బీహార్ ఎన్నికల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకోవటం గగమనార్హం. ఇదిలా ఉంటే తాజాగా ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధానన్యాయమూర్తి జస్టిస్ రాజీందర్ సచార్ ఒక కార్యక్రమంలో పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేశారు.

దేశంలో గో మాంస వ్యాపారం చేసే వారిలో 95 శాతం మంది హిందువులేనంటూ ఆయన సంచలన వ్యాఖ్య చేశారు. ఉత్తరప్రదేశ్ లోని మధుర డిగ్రీ కళాశాలలో జరిగిన ర్యాడికల్ ఇస్లామిక్ అనే అంశం మీద జరిగిన అంతర్జాతీయ సదస్సులో సచార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. గోమాంసం వ్యాపారుల్లో 95 శాతం మంది హిందువులేనని ఆయన వ్యాఖ్యానించారు.

ఉత్తరప్రదేశ్ లోని దాద్రిలో మాంసం తిన్నారన్న ఆరోపణపై ఒకరికి దారుణంగా చంపటం చూసినప్పుడు. . ఆ ఘటనను మానవత్వాన్ని హత్య చేయటంగా ఆయన అభివర్ణించారు. ఒక మాజీ చీఫ్ జస్టిస్ గోమాంస వ్యాపారుల  మీద తాజా వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. మరి.. దీనిపై రాజకీయ పక్షాలు ఎలా స్పందిస్తాయో..?​
Tags:    

Similar News