రాష్ర్టపతి పదవికి కొత్త పేరు..జస్టిస్ సదాశివం

Update: 2017-06-14 07:25 GMT
రాష్ర్టపతి ఎన్నికలకు మరో నెల రోజుల గడువు ఉన్న నేపథ్యంలో రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ రాష్ర్టపతి అభ్యర్థిత్వంపై రోజుకో పేరు తెరపైకి వస్తోంది. తాజాగా కేరళ గవర్నర్‌ సదాశివం పేరు వినిపిస్తోంది.
సదాశివం గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. తమిళనాడులోని ఒక వ్యవసాయ కుటుంబానికి చెందిన ఆయన ప్రస్తుతం కేరళ గవర్నరుగా ఉన్నారు. బీజేపీ - కాంగ్రెస్‌ సహా అన్ని పార్టీల అధినేతలతో సత్సంబంధాలు కలిగి ఉన్న సదాశివానికి న్యాయ - రాజకీయ వర్గాల్లో మంచి పేరుంది.
    
కాగా కొద్దిరోజుల కిందట వరకు జార్ఖండ్ కు చెందిన ఆదివాసీ మహిళా నేత ద్రౌపది ముర్ము పేరు ప్రముఖంగా వినిపించింది. ఆ తరువాత ఏపీ నేత వెంకయ్య నాయుడు పేరూ చక్కర్లు కొట్టింది. ఇప్పుడు రాజకీయం తమిళనాడుకు మారింది. తమిళనాడులో పాగా వేయాలనుకుంటున్న బీజేపీ ఆ రాష్ర్టానికి చెందిన వివాద రహిత న్యాయ కోవిదుడు సదాశివాన్ని రాష్ర్టపతి చేయాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై తమిళనాడులో బీజేపీ నేతల నుంచి బలమైన ప్రచారం జరుగుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News