జస్టిన్ బీబర్ కు ఫేసియల్ ఫెరాల్సిస్..: ఆవేదనలో పాప్ సింగర్

Update: 2022-06-11 09:08 GMT
తన పాటలతో కుర్రాళ్లను ఉర్రూతలూగిస్తాడు.. ఆయన పాట వచ్చిందంటే యూత్ లో ఎక్కడలేని జోష్.. అతి చిన్న వయసులోనే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు.. ఆయనే జస్టిన్ బీబర్. ఈ పాప్ సింగర్ ఇప్పుడు ఫేసియల్ పెరాలసిస్ తో బాధపడుతున్నాడు. ఈ విషయాన్ని ఆయన ఓ వీడియో తీసి సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. తన రెండు కళ్లలో ఒకదానిని ఆడించలేకపోతున్నానని, దీంతో ఓ వైపు చిరునవ్వుకూడా కనిపించదని అన్నాడు. దీంతో ఆయన చేయబోయే ప్రదర్శనలను క్యాన్సిల్ చేసుకున్నాడు. రామ్సే హంట్ సిండ్రోమ్ అనే అనారోగ్యం వల్ల ఈ వ్యాధి వచ్చిందని పేర్కాన్నాడు.

కెనడాకు చెందిన జస్టిన్ బీబర్ వయసు ప్రస్తుతం 28 ఏళ్లు. ఇంత చిన్న వయసులోనే పక్షవాతంతో బాధపడడం నా దురదృష్టం అని పేర్కొన్నాడు. గత ఫిబ్రవరిలో వరల్డ్ టూర్ ప్రారంభించిన బీబర్ ఇప్పుడు మూడు షోలను రద్దు చేసుకున్నాడు.

బీబర్ తో పాటు ఆయన భార్య హేలీ బీబర్ ఈ వారం ఆరంభంలో వాషింగ్టన్ డీసీ, టొరంటోల్లో ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. లాస్ ఏంజీల్స్ లోనూ పాటలు పాడాల్సి ఉంది. కానీ ఫేసియల్ ఫెరాల్సిస్ తో వీటిని వాయిదా వేసకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం దీని నుంచి బయట పడడానికి ఫేస్ ఎక్సర్ సైజ్ చేస్తున్నట్లు తెలిపారు.

రామ్స్ హంట్ సిండ్రోమ్ అనే వైరస్ నొప్పి పుట్టించే షింగ్లెస్ దద్దుర్లు రావడంతో పాటు ఫేసియల్ పెరాలసిస్ కూడా రావచ్చని,  దీంతో చెవిలో విపరీతమైన నొప్పి ఉంటుందని యేమో క్లీనిక్ తెలిపింది. రామ్స్ హంట్ సిండ్రోల్ లక్షణాలు తాత్కాలికమేనని పేర్కొంది. ఇది వచ్చిన వారు ఒక కన్ను మూయలేకపోవడం వల్ల నొప్పి తీవ్రంగా ఉంటుందన్నారు. దీంతో ఆ కంటి చూపు మసకబారే ప్రమాదం ఉందన్నారు. 60 ఏళ్లు దాటిన వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుందని అన్నారు.

ఈ సంరద్భంగా వీడియోలో బీబర్ మాట్లడుతూ తన చెవిలోని నరం మీద,చ ముఖం నరాల మీద ఈ వైరస్ సోకిందని తెలిపాడు. తన ముహాన్ని ఒకపక్కకు చూపిస్తూ ఆవేదనను తెలిపాడు. తన ముఖంలోని కుడి పక్క భాగం ఎలా కదలడం లేదో 24 కో్ట లమంది తన ఫాలోవర్స్ కు చూపించానంటూ నవ్వారు. ఇది చాలా సీరియస్ విషయం కాకపోయినా ఇలా జరిగి ఉండకపోతే బాగుండు అని అన్నారు. అయితే నేను కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని, అయితే మీరు ఈ పరిస్థితిని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నానని బీబర్ అన్నారు.

ఇక తాను ఏపని చేయడానికి పుట్టానో..ఆ పని పూర్తి చేస్తానని అనడం ఫ్యాన్స్ కు కన్నీళ్లు తెప్పించింది. రాబోయే ప్రదర్శనలు చేస్తానో.. లేదో.. తనకు తెలియదని, కానీ అభిమానులు మాత్రం సంయమనం పాటించాలని సూచించారు. జస్టిన్ బీబర్ భార్య హేలీ కూడా గత మార్చిలో అనారోగ్యాన బారిన పడ్డారు. మెదడులో రక్తం గడ్డకట్టడం వల్ల ఆసుపత్రిలో చేరారు. తనకు స్ట్రోక్ వచ్చిందని అది సరిచేయంచుకోవడానికి సర్జరీ చేయించుకున్నానని హేలి తెలిపారు.
Tags:    

Similar News