రాజకీయంగా ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు నిజమైన రాజకీయ నాయకుడంటారు.. గడిచిన ఐదు సార్లు నియోజకవర్గం మారి గెలుస్తూ ప్రతీ ప్రభుత్వంలో మంత్రిగా చేశారు గంటా శ్రీనివాస్ రావు.. ఈసారి కూడా నియోజకవర్గం మారి విశాఖ ఉత్తరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అలా ఎవరు అధికారంలోకి వస్తారన్నది కరెక్ట్ గా అంచనావేసి పార్టీ మారితే గంటాలా బోలెడు ప్రయోజనం.. కానీ ఇప్పుడు జగన్ ను వదిలి టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ లో పడి సర్వస్వం కోల్పోయిన సీనియర్ నేత కథ వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలపై - తన సామాజికవర్గంపై బలమైన ముద్రవేసి నాయకుడిగా కొనసాగుతున్న కాపు సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ వేసిన తప్పటడుగు ఇప్పుడు ఆయన రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టింది.. జగన్ కేబినెట్ లో డిప్యూటీ సీఎం పదవిని దూరం చేసింది. అవును.. 2014లో తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం నుంచి వైసీపీ తరుఫున పోటీచేసి గెలిచారు జ్యోతుల నెహ్రూ.. సీనియర్ కాపు నేత కావడంతో జగన్ ఏకంగా శాసనసభలో తన పక్కనే కూర్చుండబెట్టుకొని వైసీపీ శాసనసభా పక్ష ఉపనేత పదవి ఇచ్చాడు. అంత అత్యున్నత హోదా కల్పించినా జ్యోతుల నెహ్రూ మాత్రం పక్క చూపులు చూశారు. బాబు ఆపరేషన్ ఆకర్ష్ కు లోనై టీడీపీలో చేరిపోయారు. మంత్రి పదవి ఇస్తానన్న బాబు మోసం చేయడంతో ఇటు వైసీపీకి - అటు టీడీపీకి కాకుండా పోయారు..
2019 అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి ఇదే జ్యోతుల నెహ్రూ జగ్గంపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేశారు. ఈయన సమీప బంధువు జ్యోతుల చంటిబాబును వైసీపీ అభ్యర్థిగా జగన్ రంగంలోకి దించాడు. ఈ ఎన్నికల్లో జగన్ గాలి వీచి జ్యోతుల నెహ్రూ చిత్తుగా ఓడిపోయాడు..
నిజంగా జగన్ అంత స్థాయి ఇచ్చిన జ్యోతుల నెహ్రూ కనుక ఇప్పుడు వైసీపీలో ఉంటే ఖచ్చితంగా డిప్యూటీ సీఎం పోస్టును జగన్ ఇచ్చేవాడని వైసీపీలో చర్చ సాగుతోంది. కానీ ఏం చేస్తాం.. జ్యోతుల ఖర్మ అలా రాసుంది. బాబును నమ్ముకొని నిండా మునిగిన నేతల్లో జ్యోతుల ఒకడిగా దురదృష్ట నేతగా మిగిలిపోయాడు.