గ్రేటర్ హైదరబాద్ ఎన్నికలు ఎప్పుడన్న సస్పెన్స్ కు ముగింపు పడింది.. ఎన్నికల తేదీలు ఖరారైపోయాయి.. డివిజన్లలో రిజర్వేషన్లూ తేలిపోయాయి... చివరికి మేయర్ రిజర్వేషన్ కూడా తెలిసిపోయింది. బీసీ వర్గానికి మేయర్ స్థానం రిజర్వయింది. దీంతో ఈక్వేషన్లు సగం తగ్గినా కూడా మేయర్ ఎవరవుతారన్న సస్పెన్స్ మాత్రం వీడలేదు. గ్రేటర్ లో గెలుపు టీఆరెస్ దేనని దాదాపుగా అందరూ అంచనాల్లో ఉండడంతో ఆ పార్టీ బీసీ నేతల్లో ఎవరో ఒకరికి మేయర్ పదవి దక్కుతుందని భావిస్తున్నారు. అయితే... కీలక పదవి కావడంతో ఎవరో ఒకరికి ఇచ్చే సీనుండదని... ఇప్పటికే అది డిసైడైపోయుంటుందని చెబుతున్నారు. అందులోభాగంగానే ఒక్రటెండు పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా ఆ లిస్టులో టీఆర్ ఎస్ ముఖ్యనేత, ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే.కేశవరావు కూతురు పేరు వినిపిస్తోంది.
నిజానికి కేకే తన కుమారుడిని రాజకీయాల్లోకి తేవాలని తొలుత అనుకున్నా అప్పట్లో ఆయన ఓ హత్యకేసులో ఇరుక్కోవడంతో పొలిటికల్ ఎంట్రీ కుదరలేదు. దీంతో ఇప్పుడు కూతురిని రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. కేకే కుమార్తె విజయలక్ష్మీని కొన్నాళ్ల క్రితమే టీఆర్ ఎస్ లో చేర్పించిన కేకే… ప్రస్తుతం ఆమెను గ్రేటర్ బరిలో కార్పొరేటర్ గా నిలబెట్టడం పార్టీ శ్రేణులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే టీఆర్ ఎస్ లోని కొందరు ముఖ్యనేతలు మాత్రం కేకే కూతురు కార్పొరేటర్ గా పోటీ చేయడం వెనుక పెద్ద వ్యూహామే ఉందని అంటున్నారు. టీఆర్ ఎస్ కు సొంతంగా మెజార్టీ లభిస్తే… తన కూతురిని మేయర్ చేయాలని కేశవరావు… కేసీఆర్ ను కోరారట. కేసీఆర్ సైతం కేకే సూచనకు సానుకూలంగా స్పందించారని సమాచారం.