ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారం లోకి వచ్చినప్పటి నుండి ఏపీ అభివృద్దే లక్ష్యం గా ముందుకు సాగుతున్నారు. ప్రతి విషయాన్ని క్షుణ్ణం గా పరిశీలించి.. ఏ ప్రాంతానికి ఏమి కావాలో తెలుసుకుంటూ అభివృద్ధి కి బాటలు వేస్తున్నారు. తాజాగా నేడు కడప జిల్లా వాసుల చిరకాల కోరిక అయిన ఉక్కు ఫ్యాక్టరీ కి శంకుస్థాపన చేసి ..సీమ కి మంచి రోజులు రాబోతున్నాయి అంటూ చెప్పుకొచ్చారు. కడప ఉక్కు ..రాయలసీమ హక్కు అని అనేక ధపాలుగా ఎన్ని పోరాటాలు చేసినప్పటికీ ఆ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం మాత్రం కార్య రూపం దాల్చలేదు.
ఈ తరుణం లో అధికారం లోకి వచ్చిన ఆరు నెలల్లోనే 15 వేల కోట్ల పెట్టుబడి అంచనా తో వైఎస్సార్ జిల్లా జమ్మల మడుగు మండలం సున్నపురాళ్లపల్లె వద్ద ఈ ఉక్కు కర్మాగారా నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం రాష్ట్ర విభజన చట్టం లో ఉందని..దీనిని గత ప్రభుత్వంలో సాధించలేకపోయారని గుర్తు చేసారు.అలాగే ఎట్టి పరిస్థితులుల లో మూడేళ్ల కాలం లో ఉక్కు పరిశ్రమ ను పూర్తి చేస్తామని సీఎం జగన్ చెప్పారు. దీనివల్ల ప్రత్యక్షం గా.. పరోక్షం గా దాదాపు 25 వేల మందికి ఉపాధి కలుగుతుందని చెప్పుకొచ్చారు.
రాష్ట్ర విభజన చట్టం లో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ఉన్నా.. గత ప్రభుత్వం చొరవ తీసుకో లేదని ముఖ్యమంత్రి విమర్శించారు. అయిదేళ్లు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎన్నికలకు ఆరు నెలల ముందు వచ్చి శంకుస్థాపన చేయటం మోసం కాదా అని ప్రశ్నించారు. అలాగే అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో శంకుస్థాపన చేయటం తమ చిత్తశుద్దికి నిదర్శనమని సీఎం అన్నారు. రాయల సీమ కు నీరు..పరిశ్రమలు..ఉపాధి కావాలని వివరించారు. సీమ ఆర్దిక..ఉద్యోగ చరిత్ర ను మార్చే లక్షల టన్నుల ఉక్కు కర్మాగారం శంకుస్తాపన చేయటం సంతోషంగా ఉంది అని చెప్పారు.
సీమకు న్యాయం జరిగే రోజులొచ్చాయని చెప్పిన ముఖ్యమంత్రి. స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వ పని కాక పోయినా, ఇక్కడి ప్రజల చిరకాల కోరిక, అదే విధంగా ఈ ప్రాంత రూపు రేఖలు మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. గతంలో ఉక్కు ఉద్యమం సందర్భం గా ఆరుగురు విద్యార్దులు, ముగ్గురు ఉద్యోగులు బలైన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేసారు.కానీ, ఇప్పుడు ఎటువంటి ఆందోళనలు అవసరం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వ మే ముందుకు వచ్చి నిర్మాణం చేపట్టిందని చెప్పారు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ఆశాభావం వ్యక్తం చేసారు.