తెలుగుదేశం పార్టీ ఎలా ఉంటుంది.. నమ్మినోళ్లకు ఎలాంటి మర్యాద చేస్తుందో తాజాగా కడప టీడీపీ అభ్యర్థి అమీర్ బాబు భోరుమంటూ చెప్పేశాడు. కడప తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన అమీర్ బాబు.. కార్యకర్తల సమక్షంలో భోరుమని ఏడ్వడం కలకలం రేపింది. పార్టీ కోసం చేపట్టే ఏ కార్యక్రమానికైనా తన దగ్గరున్నదంతా ఊడ్చిపెట్టానని.. ఒక్క పైసా కూడా ఎవరూ సాయం చేయలేదని టీడీపీ అధిష్టానం వైఖరిపై కార్యకర్తల ముందు కన్నీరుపెట్టారు. ఇకనైనా కార్యకర్తలను టీడీపీ పట్టించుకోవాలని అమీర్ బాబు వాపోయారు..
ఎన్నికల ప్రచారంలో భాగంగా అమీర్ బాబు కడప నియోజకవర్గంలో కారకర్తలతో సమావేశం నిర్వహించారు. ఇందులో టీడీపీ పెద్దల చిన్నచూపుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భావోద్వేగాన్ని అడుపులో పెట్టుకోలేక భోరుమన్నారు.
తెలుగుదేశం పార్టీలో జెండా మోసినోళ్లు ఇంకా మోస్తూనే ఉన్నారని.. దోచుకున్నోళ్లు దోచుకుంటున్నారని అమీర్ బాబు అన్నారు. కార్యకర్తల సమక్షంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డిపై తిరుగుబాటు చేస్తున్నట్టు ప్రకటించారు. నిజాయితీ గల కార్యకర్తలకు ఆయన ఏం చేయలేదని మండిపడ్డారు.
ఇక మరోవైపు కడప ఎంపీ బరిలో నిలబడ్డ మంత్రి ఆదినారాయణ రెడ్డిపైనా అమీర్ బాబు విమర్శలు గుప్పించారు. మాకేం చేశారని ఆయనకు మద్దతు ఇవ్వాలంటూ ప్రశ్నించారు. ఇలా టీడీపీ అభ్యర్థి తెలుగుదేశంలో జరిగిన వివక్షను, వివక్షను ఎన్నికల వేళ బహిరంగంగా బయటపెట్టడం సంచలనంగా మారింది.