ప్రముఖ నటుడు, మక్కల్ నీధి మయ్యమ్ (ఎం.ఎన్.ఎం.) పార్టీ అధినేత కమల్ హాసన్ తాజాగా తన గొప్ప మనసు చాటుకున్నారు. ఉద్యోగం కోల్పోయిన మహిళా బస్ డ్రైవర్ కు కారు ను బహుమతిగా ఇచ్చారు. దీంతో ఆన్ లైన్ వేదికగా కమల్ కు అన్ని వర్గాలనుంచీ అభినందనలు వస్తున్నాయి. ఇదే సమయంలో... తమిళ నాట ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.
అవూను... కొయంబత్తూర్ కు చెందిన మహిళా డ్రైవర్ షర్మిల ను కమల హాసన్ తన కార్యాలయానికి పిలిపించుకున్నారు. ఈ సందర్భంగా "కమల్ కల్చరల్ సెంటర్" ద్వారా ఆమెకు ఒక కారు ను బహుమతికి అందించారు. ఇప్పటి వరకు ఉద్యోగిగా ఉన్న ఆమె.. ఇక పై ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించే విధంగా ఎదగాల ని ఈ సందర్భంగా కమల్ ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా కమల్ ఒక ప్రకటన విడుదల చేశారు. "కొయంబత్తూర్ మహిళా బస్ డ్రైవర్ షర్మిల చుట్టూ ఇటీవల జరిగిన చర్చతో కలత చెందాను. తన వయసు లోని ఎంతో మంది యువత కు ఆమె ఆదర్శం. షర్మిల కేవలం డ్రైవర్ గా మాత్రమే ఉండిపోకూడదు. తనలాంటి అనేకమంది షర్మిలల ను తీర్చిదిద్దాలని నేను ఆశిస్తున్నాను. కమల్ కల్చరల్ సెంటర్ తరఫున ఆమెకు కారు ను అందిస్తున్నాం. దాని ని ఆమెకు అద్దె సర్వీసుల కోసం వినియోగించుకోవచ్చు. అలాగే గొప్ప పారిశ్రామికవేత్తగా ఎదిగి మరెందరికో ఉపాధి కల్పించాలని ఆశిస్తున్నా" అని కమల్ పేర్కొన్నారు.
కాగా... 24 ఏళ్ల షర్మిల కోయంబత్తుర్ లో తొలి మహిళా డ్రైవర్ గా పేరు సంపాదించుకున్నారు. గాంధీపురం నుంచి సోమనూర్ వరకు వ్రైవేటు సంస్థకు చెందిన బస్సును ఆమె నడుపుతున్నారు. ఆ సమయంలో... గతం లో బీజేపీ నేత వనతి శ్రీనివాసన్ ఈమె బస్సులో ప్రయాణించగా.. గత శుక్రవారం ఉదయం డీఎంకే ఎంపీ కనిమొళి.. షర్మిల నడిపిన బస్సులో కోయంబత్తూరు లోని గాంధీపురం నుంచి పీలమేడు వరకు ప్రయాణించారు.
అయితే, షర్మిల పబ్లిసిటీ మోజు లో పడిందని, సెలబ్రెటీల తో సెల్ఫీల పై ఆసక్తి చూపిస్తుందని.. ఆ బస్సు యాజమాన్యం ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కథనాలొచ్చాయి. దీంతో హర్ట్ అయిన ఆమె ఉద్యోగం మానేశారని తెలిసింది. ఇదే సమయంలో... బస్ కండక్టర్ మాటలు నమ్మి యాజమాన్యం తనను అవమానపర్చిందని, అందుకే కలల కొలువుకు దూరమైనట్లు షర్మిల మాట్లాడిన వీడియో వైరల్ గా మారింది.
దీంతో... ఈ పరిస్థితులన్నీ గమనించిన కమల్ హాసన్... ఈమెకు తనవంతు సహాయం చేయాలని భావించారు. అందులో భాగంగా.. ఆఫీసుకుని పిలిపించుకుని కారు బహుమతిగా ఇచ్చారు. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో ఇది చర్చనీయాంశంగా మారింది.
అయితే... కనిమొళిని కలిసిన సందర్భంగా కండక్టర్ తో జరిగిన గొడవే యాజమాన్యం సీరియస్ అవ్వడానికి, ఫలితంగా ఈమె ఉద్యోగం నుంచి తప్పుకోవడానికి కారణం అయ్యిందని తెలుస్తుంది.
షర్మిళ నడుపుతున్న బస్సులో కనిమొళి ప్రయాణిస్తున్న సమయంలో... అదే బస్సులో కండక్టర్ గా పనిచేస్తున్న ట్రైనీ కండక్టర్ అన్నాతై... కనిమొళిని, ఆమె వెంటన వచ్చినవారి టికెట్ అడిగారట. దాని పై స్పందించిన షర్మిల... ఎంపీ ఉచిత ప్రయాణం, టికెట్ తీసుకోవద్దు అని కండక్టర్ తో అన్నారంట.
కానీ అప్పటికే తాను అప్పటికే టికెట్ తీసుకున్నానని కనిమొళి చెప్పడంతో డ్రైవర్ షర్మిల కు, కండక్టర్ కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుందట. దీంతో మహిళా కండక్టర్.. డ్రైవర్ షర్మిల తన పై అనుచితంగా ప్రవర్తించిందంటూ ఫిర్యాదు చేసిందని తెలుస్తుంది.