త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. రజనీ కాంత్ డ్రాప్ అవ్వడంతో ప్రధాన పోటీ డీఎంకే.. అన్నాడీఎంకే అని అంతా భావించారు. అయితే స్టాలిన్ నేతృత్వంలోని డీఏంకేకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ క్రమంలో సడెన్‌గా శశికళ జైలు నుంచి విడుదల కావడంతో రాజకీయం వేడెక్కింది. అయితే ఈసారి శశికళ ప్రభావం కచ్చితంగా ఉంటుందని తమిళ మీడియా అంటున్నది.
ఆమె జైలు నుంచి విడుదలైన సందర్భంలో నిర్వహించిన ర్యాలీకి ప్రజలు భారీగా తరలివచ్చారు. ఇదిలా ఉంటే తమిళనాడులో ప్రముఖ నటుడు కమల్ హాసన్ మక్కల్‌నీది మయ్యం పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ఆయన గత పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీచేసినప్పటికీ పెద్దగా ప్రభావం చూపించలేదు. అయితే ఇప్పుడు మాత్రం ఆయన తమిళనాడు వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో కమల్ ఏ స్థానం నుంచిపోటీచేయబోతున్నారన్న ఆసక్తి నెలకొన్నది.
అయితే దక్షిణ చెన్నైలోని మైలాపూర్ నియోజక వర్గం నుంచి ఆయన పోటీచేస్తారని సమాచారం. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన దక్షిణ చెన్నై నియోజకవర్గం నుంచి పోటీచేశారు. అయితే ఆయనకు మైలాపూర్ నియోజవర్గంలో అధిక ఓట్లు వచ్చాయి. దీంతో ప్రస్తుతం ఆయన మైలాపూర్ నియోజకవర్గం నుంచి పోటీచేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆయన రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. అయితే ఈ సారి కమల్‌హాసన్ ప్రభావం ఏమేరకు ఉంటుందో వేచి చూడాలి.