త్వరలో రాజకీయాల్లోకి వస్తానంటూ ప్రకటించిన ప్రముఖ నటుడు కమల్ హాసన్ తాజాగా ఆర్కే నగర్ ఓటర్లను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేస్తున్నారు రాజకీయాల్లో ఓటర్లను దేవుళ్ల మాదిరే చూసే నేతల తీరుకు భిన్నంగ ఆయన ఆర్కే నగర్ ఓటర్లను మాత్రం అందుకు భిన్నంగా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించి.. ఇటీవల కాలంలో ఒక తమిళ వారపత్రికలో ధారావాహికలా వ్యాసం రాస్తున్న ఆయన.. ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఫలితం మీదా.. తుది ఫలితం మీదా అక్కడి ఓటర్లపై విమర్శల కత్తితో చీల్చి చెండాడుతున్నారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నానని.. వెనక్కి తగ్గేది లేదని.. వెనకడుగు వేసేది లేదని చెప్పిన ఆయన.. ఆర్కే నగర్ ఓటర్లపై తీవ్ర ఆరోపణలు చేశారు.
ఒకసారి రద్దు అయిన ఆర్కే నగర్ ఉప ఎన్నిక మరోసారి నిర్వహించిన.. మొదటిసారి ఏ దృశ్యాలైతే కనిపించాయో మళ్లీ అలాంటి దృశ్యాలే ఆవిష్కృతమయ్యాయని వ్యాఖ్యానించారు. ఒక్కో ఓటుకు అధికార పార్టీ రూ.5వేలు ఇస్తే.. ఇండింపెండెంట్ అభ్యర్థి రూ.20 వేలు చొప్పున పంపిణీ చేశారన్నారు.
ఈ ఎన్నికల్లో తమ తలకు భారీ వెల కట్టిన ఇండిపెంటెండ్ అభ్యర్థినే.. తమ కష్టాలు తీర్చేందుకు వచ్చిన అపద్భాంధవుడిగా అక్కడి ఓటర్లు బటన్ నొక్కి తమ కష్టాల్ని తామే కొని తెచ్చుకున్నట్లుగా కమల్ పేర్కొన్నారు. ఆర్కే నగర్ ఓటర్లు రూ.20 టోకెన్లకు అమ్ముడుపోయారని.. ఇది భిక్షమెత్తటం లాంటిదేనన్నారు. ఇంతటి నీచమైన సంఘటన మరెక్కడైనా చూడగలమా అని కమల్ దుమ్మెత్తిపోశారు.
రాజకీయ నాయకులకు ఓటర్లు దేవుళ్లగా కనిపిస్తుంటారు. అలాంటిది.. రాజకీయాల్లోకి వచ్చి.. పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించిన కమల్.. ఓటర్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.