అదిరిపోయేలా ఉన్న లోకనాయకుడి తాజా ట్వీట్

Update: 2017-02-13 15:13 GMT
ప్రముఖులకు సామాజిక బాధ్యత ఉండదా? అని చాలామందికి డౌట్ వస్తుంటుంది.కానీ.. దానికిసమాధానం ఎవరూ చెప్పరు. అన్నింటికి మించి సెలబ్రిటీ స్టేటస్ ను ఎంజాయ్ చేసే వారు.. తమ మీదప్రజలు ప్రద్శించే అభిమానానికి తగ్గట్లుగా.. కొన్ని సున్నితమైన పరిణామాలు ఏర్పడినప్పుడు.. తమ వాదనను వినిపించటం లాంటివి చేస్తే బాగుంటుందన్న భావన వ్యక్తమైనా.. మనకెందుకులే అన్న భావనతో చాలామంది ఊరకుండిపోతుంటారు.

కానీ.. మిగిలిన వుడ్ లతో పోలిస్తే.. కోలీవుడ్ ఈ విషయంలో కాస్త భిన్నమని చెప్పాలి.  ప్రకృతి విపత్తుల్లోనే కాదు.. జల్లికట్టు లాంటి సామాజిక ఉద్యమ సమయాల్లో.. తాజాగా చోటు చేసుకున్న రాజకీయ సంక్షోభ సమయాల్లో కొందరు చిత్రపరిశ్రమ వర్గాలు తమ అభిప్రాయాల్ని సూటిగా వెల్లడించటం కనిపిస్తుంటుంది.

నిజానికి ఇలాంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటానికి.. తలదూర్చటానికి మిగిలిన చిత్రపరిశ్రమకు చెందిన వారు అస్సలు ఇష్టపడరు. కానీ.. అందుకు భిన్నంగా కొందరు సినీ ప్రముఖులు తమిళనాడు తాజా రాజకీయ సంక్షోభంపై స్పందిస్తున్నారు. ఇలా స్పందిస్తున్న వారిలో లోక నాయకుడిగా ఇమేజ్ ఉన్న ప్రముఖ నటుడు కమల్ హాసన్.. తన వైఖరిని చెప్పే రీతిలో చెప్పేస్తున్నారు. తాజాగా ఆయన చేసిన ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

అధికారం రెండు రకాలని.. ఒకటి శిక్ష పడుతుందన్న భయంతో అధికారాన్ని చేజిక్కించుకోవటం.. రెండోది ప్రేమ పూర్వకంగా చేపట్టటం.. అంటూ మహాత్మాగాంధీ చెప్పి మాటల్ని సమయానుకూలంగా కోట్ చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. తాను అనుసరించే హీరో గాంధీ మాటల్ని సమయానికి.. సందర్భానికి తగ్గట్లుగా చెప్పేసిన ఆయన తీరుపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.

ఏళ్ల తరబడి తమను మోసం చేస్తున్న చాలామంది సూపర్ స్టార్ల కంటే ప్రస్తుత రాజకీయాలపై కనీసం స్పందించేందుకు భయపడేవారి కంటే మీరే చాలా బెటర్ అంటూ.. కమల్ ట్వీట్ ను పొగిడేస్తున్నారు. మొత్తానికి తాజా పరిణామాలపై కమల్ చొరవ.. మరికొందరు సినీ ప్రముఖులకు స్ఫూర్తిగా నిలవాలని ఆశిద్దాం. ప్రజా చైతన్యం గురించి సినిమాల్లో డైలాగులు చెప్పటమే కాదు.. రియల్ గా కూడా ప్రజల్లో చైతన్యం వెల్లివిరిసేలా వ్యవహరిస్తున్న కమల్ కు అభినందించాల్సిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News