అధికారపక్షానికి చెందిన నేత ఇంటికి కూలగొట్టటమా? అదేమన్నా.. బెజవాడలో గుళ్లు కూలగొట్టినంత ఈజీనా? అన్న డౌట్ రావొచ్చు. కానీ.. ఇది నిజం. కాకుంటే.. ఏపీలో కాకుండా తెలంగాణలో. టీడీపీ సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్ రావుకు చెందిన ఆక్రమ కట్టడాన్ని గ్రేటర్ హైదరాబాద్ అదికారులు కొద్ది సేపటి కిందట కూల్చేయటం చర్చనీయాంశంగా మారింది. టీడీపీలో అధినేతకు సన్నిహితులైన నేతల్లో కంభంపాటి ఒకరు.
అలాంటి నేతకు చెందిన ఆక్రమ భవనాన్ని కూల్చేందుకు గ్రేటర్ అధికారులు ఎలాంటి మొహమాటానికి గురి కాకుండా.. కూల్చేయటం ద్వారా.. ఆక్రమ కట్టడాల విషయంలో తెలంగాణ అధికారులు ఎంత నిక్కచ్చిగా వ్యవహరించనున్నారన్న విషయాన్ని తమ చేష్టలతో స్పష్టం చేశారని చెప్పాలి. భవంతిని కూల్చేందుకు నోటీసులు జారీ చేశామని.. ఆ తర్వాతే తాము భవంతిని కూల్చేసినట్లుగా అధికారులు చెబుతున్నారు. కట్టడాన్ని కూల్చే సమయంలో అధికారులకు కంభంపాటి అనుచరులు అడ్డుపడగా.. పోలీసులు జోక్యం చేసుకొని వారిని చెదరగొట్టటం గమనార్హం. ఆక్రమం అయితే చాలు.. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా కూల్చే విషయంలో మరో మాటకు అవకాశం లేదన్న విషయాన్ని తాజా ఉదంతంతో గ్రేటర్ అధికారులు స్పష్టం చేశారని చెప్పొచ్చు.