'1వ తరగతి కూతురు ఫీజు రూ.4 లక్షలు'... వైరల్ గా ఓ తండ్రి ఆవేదన!

చాలా గ్రామంలో రెండు కంటే ఎక్కువ ప్రైవేటు స్కూల్స్ ఉన్నాయనే విషయం దీనికి బలం అని చెబుతుంటారు.

Update: 2024-11-20 04:50 GMT

ఎవరు 'అవును' అన్నాం 'కాదు' అన్నా.. మరెవరు "అవునా?" అన్నా... భారతదేశంలో విద్య వ్యాపారం కాదనే మాట వాస్తవం! ఈ అధికారిక మాటల సంగతి కాసేపు పక్కనపెడితే... దేశంలో అత్యంత లాభదాయకమైన వ్యాపారాల్లో విద్య ఒకటని (అనధికారికంగా) చెప్పేవారూ లేకపోలేదు! చాలా గ్రామంలో రెండు కంటే ఎక్కువ ప్రైవేటు స్కూల్స్ ఉన్నాయనే విషయం దీనికి బలం అని చెబుతుంటారు.

దీనికి గల కారణం ప్రజలా.. ప్రభుత్వాలా.. భారతదేశంలో ప్రతీ ఇంటికీ ఓ దొడ్డిదారి ఉంటుందంటు కొన్ని చట్టాల గురించి వినిపించే కామెంట్లా అనే సంగతి కాసేపు పక్కనపెడితే... ఇటీవల కాలంలో ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు మాత్రం తల్లి తండ్రులకు అత్యంత పెద్ద సమస్యగా మారుతున్నాయని అంటున్నారు. ఈ క్రమంలో... తాజాగా ఓ ఐఐటీయన్ పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది.

అవును... నాణ్యమైన విద్యను కోరుకునే మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక ఒత్తిడిని ఎత్తిచుపుతూ ముంబైలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) పూర్వ విద్యార్థి ఓ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా... పెరుగుతున్న విద్య వ్యయం గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ విషయం నెట్టింట తీవ్ర చర్చకు దారి తీసింది.

వివరాళ్లోకి వెళ్తే... జైపూర్ కు చెందిన రిషబ్ జైన్ అనే వ్యాపారవేత్త.. సిటీలోని ఓ స్కూల్ ఫీజు వివరాలు పంచుకున్నారు. ఇందులో భాగంగా.. ఫస్ట్-స్టాండర్డ్ విద్యార్థిని చేర్చుకోవడానికి సుమారు రూ.4.27 లక్షలు ఖర్చు అవుతుందని.. వార్షిక ఆదాయం రూ.20 లక్షలు ఉన్న కుటుంబాలకు కూడా ఇది భరించలేని భారమని అభిప్రాయపడ్డాడు.

ఈ సందర్భంగా... "మంచి విద్య అనేది మధ్యతరగతి భరించలేని విలాసం" అని ఎక్స్ లో పేర్కొంటూ.. తన కుమార్తె వచ్చే ఏడాది గ్రేడ్-1 ని ప్రారంభిస్తుందని.. ఈ సందర్భంగా తము పరిశీలించిన ఓ స్కూల్ లో ఫీజు స్ట్రక్చర్ ఇలా ఉందని.. ఇతర మంచి స్కూల్స్ లో కూడా ఈ విధమైన ఫీజులను కలిగి ఉన్నాయని చెప్పారు!

రిజిస్ట్రేషన్ ఛార్జెస్ - రూ.2,000

అడ్మిషన్ ఫీ - రూ.40,000

కాషన్ మనీ (రిఫండబుల్) - రూ.5,000

యాన్యువల్ స్కూల్ ఫీ - రూ.2,52,000

బస్ ఛార్జెస్ - రూ.1,08,000

బుక్స్ & యూనీఫాం - రూ.20,000

మొత్తం కలిసి ఏడాదికి రూ.4,27,00

దీంతో.. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. చాలా మంది మధ్యతరగతి తల్లితండ్రులను ఈ పొస్ట్ టచ్ చేసింది. ఈ సందర్భంగా విద్య ఒక వాణిజ్య సంస్థగా మారింది.. ప్రభుత్వాల అలసత్వాలే ప్రైవేటు పాఠశాలలకు వరాలు అనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా... "భారత్ లో విద్య వ్యాపారం కాదు!" అని గుర్తు చేస్తున్నారు నెటిజన్లు!

Tags:    

Similar News