నిన్నటికి నిన్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరుపున ప్రచారం చేయడానికి అగ్రహీరో సుదీప్ బయటకొచ్చారు. సీఎం బొమ్మై కోసం ప్రచారం చేస్తానని మాట ఇచ్చాడు. నేడు మరో కన్నడ స్టార్ హీరో కు భారీ ఆఫర్లు వస్తున్నాయి. కర్ణాటక ఎన్నికల్లో గెలుపు కోసం స్టార్ల వెంట పడుతున్నాయి పార్టీలు. సినీ గ్లామర్ కోసం అందరినీ సంప్రదిస్తున్నారు. ప్రధాన నటులపై ఫోకస్ చేశారు.
కన్నడ స్టార్ హీరో యశ్ ను కూడా ప్రచార రంగంలోకి దింపాలని పలు పార్టీలు సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అభ్యర్థుల తరుఫున ప్రచారాన్ని చేపట్టేందుకు పార్టీలకు చెందిన నాయకుల ఆఫర్లను యష్ తిరస్కరించినట్టు సమాచారం.
కేజీఎఫ్ తో యశ్ క్రేజ్ దేశవ్యాప్తమైంది. దీంతో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ లు ఆయనను స్టార్ క్యాంపెయినర్ గా తీసుకోవాలని నిరంతరం సంప్రదిస్తున్నాయట.. అయితే యష్ మాత్రం తన భవిష్యత్ సినిమా ప్రాజెక్టులపై ఫోకస్ చేసి రాజకీయ నాయకుల ఆఫర్లను తిరస్కరిస్తున్నట్టు సమాచారం.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు అభ్యర్థుల కోసం యష్ ప్రచారం చేశాడు. కన్నడ సూపర్ స్టార్ దర్శన్ తో కలిసి మాండ్యాలో నటి సుమలత అంబరీష్ ను గెలిపించాలని ప్రచారం చేశారు. సుమలత గెలిచింది కూడా. దీంతో ఆయనను ప్రచారంలోకి తీసుకురావాలని యోచిస్తున్నారు.
ప్రస్తుతం యష్ వరుస సినిమా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ నెలాఖరులోగా ఆయన తాజా సినిమాల ప్రకటన వెలువడుతుందని తెలుస్తోంది.
ఇక యశ్ నే కాదు కాంతారా హీరో రిషబ్ శెట్టిని కూడా ప్రచారం కోసం సంప్రదించినట్టు సమాచారం. అయితే రిషబ్ ఏ పార్టీకి ప్రచారం చేయవద్దని డిసైడ్ అయినట్టు సమాచారం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.