కమెడియన్ కామెడీగా మాట్లాడతారనుకుంటే తప్పులో కాలేసినట్లే. తాజాగా ప్రముఖ కమెడియన్ ఒకరు చేసిన ట్వీట్ ఇప్పుడు మోడీ సర్కారుకు షాకిచ్చేలా చేయటమే కాదు.. సంచలనంగా మారింది కూడా. తమకు కానీ అధికారంలో చేతికి వస్తే ప్రజలకు మంచి రోజులు వచ్చేసినట్లుగా చెప్పిన బీజేపీ నేతల మాటలకు.. చేతలకు మధ్యనున్న వ్యత్యాసాన్ని ఒక సెలబ్రిటీ తనకు ఎదురైన అనుభవాన్ని పోస్ట్ చేయటమే కాదు.. అచ్చేదిన్ అంటే ఇదేనా మోడీ అంటూ చేసిన ట్వీట్ సెగలు పుట్టిస్తోంది.
టీవీ వ్యాఖ్యాత.. ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ చేసిన ట్వీట్ ఒకటి సంచలనంగా మారింది. అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా.. కిందిస్థాయిలో మార్పు మాత్రం ఏమీ లేదన్న విషయాన్ని స్పష్టం చేయటమే కాదు.. మోడీ సర్కారులో అవినీతి ఎంత ఎక్కువగా ఉందన్న విషయాన్ని ఓపెన్ గా చెప్పేసిన తీరు ఇప్పుడు షాకింగ్ గా మారింది. తన ఆఫీసు పని మీద ముంబయిలోని ఒక గవర్నమెంట్ ఆఫీసుకు వెళ్లిన కపిల్ శర్మను రూ.5లక్షల లంచం అడిగారట.
దీంతో మండిపోయిన కపిల్ శర్మ తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో ట్వీట్ రూపంలో పోస్ట్ చేశారు. తన ఆఫీసును నడిపేందుకు ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ కు వెళ్లిన తనను రూ. 5లక్షల లంచం అడిగారన్న ఆయన ఈ విషయం మీద మోడీకి ట్వీట్ పోస్ట్ చేశారు. తాను ఐదేళ్లుగా రూ.15 కోట్లు ప్రభుత్వానికి చెల్లిస్తున్నానని.. అయినా సరే తాను లంచం ఇవ్వాల్సిందేనా? అంటూ సూటిగా ప్రశ్నించారు. ఇక్కడితో వదిలిపెడితే ఇది వార్త అయ్యేదే కాదు. ప్రభుత్వ అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కపిల్ శర్మ.. మోడీగారూ ఇదేనా మీ అచ్చేదిన్? అంటూ ఎక్కడ తగలాలో అక్కడ తగిలేలా ప్రశ్నను ట్వీట్ చేశారు. మరి.. కపిల్‌శర్మ ప్రశ్నకు ప్రధాని స్పందిస్తారా..?