పెళ్లి కి పరిమితులు పెట్టనున్న కర్ణాటక

Update: 2015-11-21 05:47 GMT
కర్ణాటక రాష్ట్రంలో పెళ్లిళ్ల వ్యవహారం రానున్న రోజుల్లో ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. మారిన కాలంతో.. ఒక మోస్తరు ఆర్థిక స్థితి ఉన్న వారు సైతం.. భారీగా పెళ్లిళ్లు చేయటం ఒక అలవాటుగా మారిన సంగతి తెలిసిందే. ఇలాంటి వైఖరిని అడ్డుకోవటం కోసం తాజాగా ఒక ప్రైవేట్ బిల్లును కర్ణాటకు సర్కారు అసెంబ్లీలో పెట్టింది. ఈ బిల్లులోని అంశాలు కానీ చట్టరూపం దాలిస్తే.. కర్ణాటకలోని పెళ్లిళ్లు పరిమితుల చట్రంలో చేయాల్సి ఉంటుంది.

ఆడంబర వివాహాలకు చెక్ పెట్టేందుకు వీలుగా ఉంటే ఈ ప్రైవేటు బిల్లులోని అంశాలు చూస్తే కాస్తంత ఆశ్చర్యంగా అనిపించక మానదు. మరి.. తాజాగా చేప్టటాలని భావిస్తున్న పరిమితులపై ప్రజల్లో వ్యతిరేకత రావొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులోని పరిమితులు చూస్తే.. జీవితంలో జరిగే పెళ్లికి కూడా పరిమితులు.. పన్నుపోటు అవసరమా? అనిపించక మానదు. 2014లోనూ ఇలాంటి బిల్లునే చట్టంగా తీసుకొద్దామని ప్రయత్నించి.. తీవ్ర నిరసనలతో వెనక్కి తగ్గిన కర్ణాటక ప్రభుత్వం.. తాజాగా మరోసారి అలాంటి ప్రయత్నాన్ని చేపట్టటం గమనార్హం.

పెళ్లిళ్లపై పరిమితులు విధించాలన్న లక్ష్యంతో కర్ణాటకలో ప్రవేశ పెట్టిన ప్రైవేటు బిల్లులోని అంశాలు చూస్తే..

= పెళ్లికి వచ్చే అతిధుల సంఖ్య 300 దాటితే పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

= పెళ్లి ఖర్చు కానీ రూ.5లక్షలు దాటితే విలాస పన్ను కట్టాల్సి ఉంటుంది.

= కల్యాణ మండపాల అద్దె కింద వసూలు చేసే మొత్తం రోజుకు రూ.50వేలకు దాటకూడదు.

= ఒకవేళ రూ.50వేలు దాటితే.. కల్యాణమండపాల నిర్వాహకులపై చర్యలు తీసుకుంటారు.

= పెళ్లికి ఆహ్వానించే వారికి సంబంధించిన వివరాల్ని రెండు వారాల ముందు అధికారులకు అందించాలి.

= పెళ్లికి వచ్చినప్పుడు అతిధులు తీసుకొచ్చే బహుమతుల మీద పన్ను విధించాలి.

= పెళ్లిళ్లలో ఏర్పాటు చేసే డెకరేషన్ సైతం పరిమితంగా ఉండాలి.

= పెళ్లి చేసుకున్న నెల రోజుల్లో రిజిష్టర్ ఆఫీసులో వివరాలు నమోదు చేసుకోవాలి.
Tags:    

Similar News