స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించి, మంత్రి పదవిలో చక్రం తిప్పిన రాజకీయ నాయకుడిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయన కారులోనే కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత మూడు రోజుల పాటు చిత్రహింసలకు గురి చేసి ముప్పుతిప్పలు పెట్టి, రూ. 30 కోట్లు ఇస్తే వదిలేస్తాం అంటూ కిడ్నాపర్లు బెదిరించారు. మూడు రోజులు మాజీ మంత్రిని చిత్రహింసలకు గురి చేసి , చేతికి చిక్కిన డబ్బులు లాక్కొని ఆయన్న నిర్జనప్రదేశంలో వదిలేసి వెళ్లిపోవడం కలకలం రేపింది. కిడ్నాపర్లకు మాజీ మంత్రి రూ. 1. 50 కోట్లు ఇచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ మాజీ మంత్రి తాను కిడ్నాపర్లకు రూ. 48 లక్షలు ఇచ్చానని పోలీసులకు చెప్పి కేసు పెట్టి , వారిని పట్టుకోవాలంటూ ఫిర్యాదు చేసారు.
కర్ణాటక లోని కోలారు శాసన సభ నియోజక వర్గం నుంచి ఆర్. వర్తూరు ప్రకాష్ రెండు సార్లు స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు.ఆ తర్వాత ఊహించని విధంగా వర్తూరు ప్రకాష్ కు ఊహించని విధంగా మంత్రి పదవి దక్కింది. నవంబర్ 25వ తేదీన వర్తూరు ప్రకాష్ కోలారు సమీపంలోని ఫామ్ హౌస్ కు వెళ్లారు. అదే రోజు రాత్రి 7 గంటల సమయంలో కారు డ్రైవర్ సునీల్ తో పాటు వర్తూరు ప్రకాష్ ఆయన కారులో బెంగళూరుకు బయలుదేరారు. ఫామ్ హౌస్ నుంచి ఒక్క కిలోమీటరు వెళ్లగానే కొందరు అయన కారుని అడ్డుగించి ,ఇనుప రాడ్లు, కత్తులతో బెదిరించిన మాజీ మంత్రి వర్తూరు ప్రకాష్, ఆయన కారు డ్రైవర్ సునీల్ ను అదే కారులో కూర్చోబెట్టి, కళ్లకు గంతలు కట్టి కారులో తిప్పుతూ గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లారు.
వారు 30 కోట్లు డిమాండ్ చేయడం తో అయన నిరాకరించారని, ఆ తర్వాత చిత్ర హింసలకు గురిచేయడం తో డబ్బు ఇవ్వడానికి ఒప్పుకున్నారని తెలుస్తుంది. డిసెంబర్ 1వ తేదీ రాత్రి బెంగళూరులోని బెళ్లందూరులోని స్మశానవాటికలో మాజీ మంత్రి వర్తూరు ప్రకాష్ పార్చనూర్ కారు గుర్తించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి వర్తూరు ప్రకాష్ బెళ్లందరూరు చేరుకుని అక్కడి పోలీసులకు తానను కిడ్నాప్ చేశారని కేసు పెట్టారు. మాజీ మంత్రి వర్తూరు ప్రకాష్ అనుచరుడు నయాజ్ అనే వ్యక్తి కోలారు సమీపంలోని కాఫీ డే దగ్గర కిడ్నాపర్లకు రూ. 48 లక్షలు ఇచ్చాడని, రెండు రోజుల తరువాత తనను వదిలేశారని మాజీ మంత్రి పోలీసులకు చెప్పారు. అయితే కిడ్నాపర్లకు మాజీ మంత్రి రూ. 1. 50 కోట్లు ఇచ్చారని సమాచారం. కర్ణాటకలో గత అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా సొంతంగా పార్టీ పెట్టిన వర్తూరు ప్రకాష్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్యకు వర్తూరు ప్రకాష్ అంత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. మాజీ మంత్రి వర్తూరు ప్రకాష్ ను కిడ్నాప్ చేసింది ఎవరు ? అసలు ఏం జరిగింది ? అనే కోణంలో పోలీసులు విచారణ మొదలుపెట్టారు.