కర్ణాటక ఎన్నికల సర్వే : బీజేపీకి ఓటమి తప్పదు.. కాంగ్రెస్ దే అధికారం

Update: 2023-04-26 19:47 GMT
టీవీ9-సీ ఓటర్ నిర్వహించిన ప్రీ-పోల్ సర్వే 2023 రిపోర్ట్ బయటకు వచ్చింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన విజయం సాధిస్తుందని అంచనా వేసింది. ఓట్ల శాతం పరంగా కాంగ్రెస్ తన పనితీరును మెరుగుపరుచుకున్నదని, బీజేపీ మరింత దిగజారిందని సర్వేలో తేలింది.
 
టీవీ9-సీవోటర్ నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్ 40 శాతం ఓట్లతో 106-116 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. బీజేపీకి 33.9 శాతం ఓట్లతో 79-89 సీట్లు వస్తాయని అంచనా వేయగా, జేడీఎస్ 18.8 శాతం ఓట్లతో 24-34 సీట్లు, ఇతరులు 7.3 శాతం. ఓట్ షేర్‌తో 0-5 సీట్లు పొందవచ్చని అంచనా వేశారు.
 
ప్రీ-పోల్ సర్వే ప్రకారం, 2018 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేసిన కిత్తూరు కర్ణాటకలో బీజేపీ తీవ్రంగా దెబ్బతింటుందని తేల్చింది.  కోస్టల్ కర్ణాటక ప్రాంతంలో మంచి పనితీరుతో బీజేపీ సీట్లు పెంచుకుంటుందని విశ్లేషించింది. కోస్తా కర్ణాటకలో అధికార బీజేపీ 16-20, కాంగ్రెస్ 1-05, జేడీఎస్ 0, ఇతరులు 0-1 సీట్లు సాధిస్తారని అంచనా వేశారు.

కిత్తూరు కర్నాటక ప్రాంతంలో బీజేపీ కంచుకోటలో కాంగ్రెస్ పుంజుకోనుందని తేల్చింది.  కాంగ్రెస్‌కు 25-29 సీట్లు, బీజేపీకి 21-25 సీట్లు, జేడీఎస్‌కు 0-1, ఇతరులకు 0-1 సీట్లు వస్తాయని అంచనా వేసింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని 50 సీట్లకు గాను కాషాయం పార్టీకి 30 సీట్లు వచ్చాయి. అయితే, కాంగ్రెస్ 17 సీట్లు, జేడీఎస్ 2, ఇతరులు 1 సీట్లు గెలుచుకోగలిగింది.

కళ్యాణ కర్ణాటక ప్రాంతంలో కూడా కాంగ్రెస్‌కు గరిష్టంగా 16-20 సీట్లు వస్తాయని అంచనా. బీజేపీకి 11-15 సీట్లు వస్తాయని అంచనా వేయగా, జేడీఎస్ 3 సీట్లు కోల్పోతుందని అంచనా వేసింది.

గ్రేటర్ బెంగళూరు రీజియన్‌లో కాంగ్రెస్‌కు 18-22, బీజేపీకి 7-11, జేడీఎస్‌కు 1-5, ఇతరులకు 1 సీట్లు వస్తాయని అంచనా వేసింది.

కర్ణాటకలో తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అవుతారనే దానిపై ప్రీ-పోల్ సర్వే ప్రతివాదుల అభిప్రాయాలను కూడా అడిగి తేల్చింది.. ఇతర నేతల కంటే జేడీ(ఎస్) నుంచి హెచ్‌డీ కుమారస్వామికే ముఖ్యమంత్రి పదవి ఇవ్వొచ్చని మెజార్టీ ప్రజలు తమ తీర్పు చెప్పడం విశేషం. హంగ్ వస్తే కుమారుస్వామినే సీఎం కావచ్చని తెలుస్తోంది.

Similar News