కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి త్వరలో వైసీపీలో చేరనున్నట్లు సమాచారం. అయితే... దీనిపై ఆయన నేరుగా రంగంలోకి దిగనప్పటికీ కుమారుడు మహేశ్ రెడ్డి మొత్తం వ్యవహారం నడిపిస్తున్నారు. ఆయన ఇప్పటికే లోటస్ పాండ్ లో వైసీపీ అధినేత జగన్ తో భేటీ అయి పార్టీలో చేరికపై పూర్తిగా చర్చించారు.
ఈ మేరకు సొంత నియోజకవర్గమైన గుంటూరు జిల్లాలోని నరసరావుపేటలో ఈ నెల 16న భారీ సభ ఏర్పాటు చేసి అధికారికంగా వైసీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ లోని కాసు కృష్ణా రెడ్డి వర్గమంతా వైసీపీలోకి గంపగుత్తగా వెళ్లేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది.
మరోవైపు కృష్ణారెడ్డి కూడా అక్కడికి కొద్దిరోజుల్లోనే వౌసీపీలో చేరుతారని తెలుస్తోంది. ప్రస్తుతం నరసరావుపేటలో కాసు కృష్ణారెడ్డి ప్రభ కొంత తగ్గినా మహేశ్ మాత్రం తండ్రి ప్రతిష్టను అండగా చేసుకుని పట్టు పెంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఉనికిలో లేని కాంగ్రెస్ లో ఉంటే రాజకీయ ఎదుగుదల కష్టమని భావించి వైసీపీలో చేరుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/