కత్తి మహేశ్. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారికి బాగా సుపరిచితమైన పేరు. కేవలం నెగిటివ్ కామెంట్లు, పవన్‌కల్యాణ్‌పై తిట్లతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారాడు కత్తి మహేశ్. పవన్ కల్యాణ్ తర్వాత శ్రీరెడ్డి విషయంలో కూడా ఎక్కువుగా స్పందించి బాగానే పాపులర్ అయ్యాడు. ఇక రామాయణంలో వివాదాస్పద కామెంట్లు చేయడంతో హైదరాబాద్ పోలీసులు కత్తి మహేశ్‌ని ఆరు నెలల పాటు హైదరాబాద్ నుంచి బహిష్కరించారు. ప్రస్తుతం అతని బహిష్కరణ కూడా పూర్తైంది. రెగ్యులర్‌గా సోషల్ మీడియాలో, అప్పుడప్పుడు టీవీ చానెల్స్ డిబేట్‌లో కన్పించే కత్తి.. ప్రస్తుతం మాత్రం ఎక్కడా కన్పించడం లేదు. అసలు ఎక్కడికి వెళ్లాడు చెప్మా అని ఎంక్వైరీ చేస్తే.. వైసీపీ తరపున ఏపీలోని 13 జిల్లాల్లో ఎన్నికల ప్రచారంలో ఉన్నాడు ఈ చిత్తూరు చిన్నోడు.
కత్తి మహేశ్ ప్రస్తుతం గుంటూరు జిల్లా ముప్పాళ్ళ మండలంలోని గోళ్ళపాడు - ముప్పాళ్ళ గ్రామాల్లోని ఎస్సీ కాలనీల్లో సోమవారం వైఎస్సార్ సీపీకి మద్దతుగా ప్రచారం చేస్తున్నాడు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏ వర్గానికి న్యాయం జరగలేదని విమర్శించారు కత్తి మహేశ్. ఎస్సీలను టీడీపీ కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుందని అన్నారు. బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, వైఎస్సార్ సీపీకి అండగా ఉండాలన్నారు. ప్రస్తుతం వైసీపీ గాలి వీస్తుందని.. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ అధికారంలోకి రావడం పక్కా అని అన్నాడు కత్తి మహేశ్. మొత్తానికి ఎన్నికల వేళ వైసీపీకోసం బాగానే కష్టపడుతున్నాడు కత్తి మహేశ్.