భారతీయ టీవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న గేమ్ షోలలో ‘కౌన్‌బనేగా కరోడ్‌పతి’ది అగ్రస్థానమంటే అతి శయోక్తి కాదేమో.. ఆ షోకు మన దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. చిన్నపిల్లలు, పెద్దవాళ్లు అందరూ ఈ షోను ఇష్టపడతారు. ఈ షోలో కోట్లు గెలుచుకొని బాగుపడినవారు ఎందరో ఉన్నారు. షోలో కోటి రూపాయలు గెలుచుకొని జీవితంలో సెటిల్ అయినవారూ ఉన్నారు. అందులో బిహార్‌కు చెందిన సుశీల్ కుమార్ ఒకరు. ఆయన ఈ షోలో రూ. 5కోట్లు గెలుచుకున్నారు. కానీ సుశీల్ మాత్రం ‘కౌన్‌బనేగా కరోడ్‌పతి’ ఓ చెత్త షో అంటున్నారు. ఈ షో తన జీవితాన్ని నాశనం చేసింది అంటున్నారు. ఆయన ఎందుకంత నిరాశ చెందారో ఫేస్బుక్లో రాసుకున్నారు.
సుశీల్ ఏమంటారంటే.. ‘నేను ఐదో సీజన్లో పాల్గొని రూ. 5 కోట్లు గెలుచుకున్నాను. కానీ అప్పటి నుంచి నా జీవితం సాఫీగా సాగలేదు. నేను ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాను. 2015-16 నా జీవితంలో చాలా క్లిషమైన సమయం. షో గెలిచాక పలు టీవీలు నన్ను ఇంటర్వ్యూలకు ఆహ్వానించాయి. ఇలా నెలలో 15 రోజులు నాకు టీవీ షోలకు వెళ్లడమే సరిపోయింది. దీంతో నా సమయం వృథా అయ్యింది. దాంతో నా చదువు గాడి తప్పింది. టీవీ జర్నలిస్టులంతా నా వ్యక్తిగత జీవితం గురించి దుష్ప్రచారం చేశారు. దీంతో నా భార్య వదిలేసి వెళ్లింది. కొంతమంది నన్ను తప్పుదోవపట్టించి బిజినెస్‌లలో పెట్టుబడులు పెట్టించారు. దీంతో నేను నష్టపోయా. అనంతరం ఢిల్లీకి వెళ్లి స్టూడెంట్ నాయకులను కలుసుకున్నాను. ఆ సమయంలో నాకు సిగరేట్, ఆల్కాహాల్ కూడా అలవాటయ్యాయి.
సినిమాల పిచ్చితో ముంబై కూడా వెళ్లాను. అక్కడ కొన్ని యాడ్లకు పనిచేశా. ఓ సినిమాకు స్క్రిప్ట్ కూడా రాశా. ఇరవైవేలు ఇచ్చారు. చివరకు అన్ని వదిలిపెట్టి మా సొంతూరులో టీచర్‌గా పనిచేస్తున్నా. ఇదే నాకు తృప్తి నిచ్చింది. ఇంతకు నేను చెప్పేది ఏమిటంటే.. మనం పాపులారిటీ సాధించి సెలబ్రిటీగా బతకడం కంటే.. ఓ సాధారణ వ్యక్తిగా భార్యాపిల్లలతో జీవించడమే గొప్పవిషయం’ అంటూ ఫేస్బుక్లో రాసుకొచ్చారు సుశీల్. ఈ పోస్టు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. సుశీల్ తప్పుచేసి టీవీ షోను తిట్టడం సరికాదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.