నాన్నను ఏం పొగిడావ్ కవితక్క

Update: 2015-12-20 10:04 GMT
తండ్రి మీద అభిమానాన్ని తరచూ ప్రదర్శించే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె .. నిజామాబాద్ ఎంపీ మరోసారి తన తండ్రిని ఆకాశానికి ఎత్తేశారు. తన తండ్రి మీద ఆమె పొగిడేయటమే కాదు.. బిరుదులు కూడా ఇచ్చేశారు. తన తండ్రి భోళా శంకరుడని.. అడిగినవన్నీ కాదనకుండా ఇచ్చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ఈ కారణం చేతనే తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ ను భోళా శంకరుడని అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆమె తండ్రికి భోళా శంకరుడన్న బిరుదును ఇచ్చేశారు. అంతేకాదు.. తన తండ్రి మహిళా పక్షపాతి అని.. అందుకు తెలంగాణ ఉద్యమమే నిదర్శనమని చెప్పుకొచ్చారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్.. మహిళలకు పెద్దపీట వేశారని చెపుకొచ్చారు. కవితక్క మాటలే నిజమే అని అనుకుంటే.. అంత పెద్ద మహిళా పక్షపాతికి.. తన క్యాబినెట్ లో ఒక్కరంటే ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఎందుకు ఇవ్వనట్లు..? మహిళా పక్షపాతికి కూడా.. మహిళలకు మంత్రి పదవిని ఇవ్వలేకుండా ఉండే పరిమితులు ఉంటాయా..?
Tags:    

Similar News