తెలంగాణ ముఖ్యమంత్రి తనయ, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తెలంగాణ అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న తీరును వీక్షించేందుకు వచ్చిన కవితకు అధికారులు స్వాగతం పలికారు. సందర్శకుల పాస్ తీసుకొని శాసనసభకు వచ్చిన కవిత...వీక్షకుల గ్యాలరీలో కూర్చున్నారు. ఈ సందర్భంగా అక్కడున్న వారితో కాసేపు ముచ్చటించారు.
ఈ క్రమంలోనే విజిటర్ గ్యాలరీలో సెల్ఫీల హడావుడి సాగింది. ఎంపీ కవిత పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఆర్మూర్ నియోజకవర్గ టీఆర్ ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సెల్ఫీలు దిగారు. కవిత గ్యాలరీలో ఉన్న సమయంలో దింపిన సెల్ఫీలు తన మిత్రులతో పంచుకున్నారు.