ఆప‌రేష‌న్ త‌ర్వాత కేసీఆర్‌ కు అంత తేడా వ‌చ్చింద‌ట‌

Update: 2017-09-12 05:35 GMT
ఏళ్ల‌కు ఏళ్లు.. వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వ‌చ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కంటి ఆప‌రేష‌న్ దిగ్విజ‌యంగా ముగిసిన వైనం తెలిసిందే. కంటి ఆప‌రేష‌న్ కోసం ఢిల్లీకి వెళ్లి మ‌రీ.. ఆప‌రేష‌న్ చేయించుకోకుండా తిరిగి వ‌చ్చిన సంద‌ర్భాలెన్నో. దీనికి కార‌ణాలు ఏమైనా.. ఎట్ట‌కేల‌కు ఢిల్లీలో కేసీఆర్ క‌ళ్ల‌కు డాక్ట‌ర్ స‌చిదేవ్ ఆప‌రేష‌న్ చేశారు. కేసీఆర్ ఎడ‌మ కంటికి ఆప‌రేష‌న్ చేయించుకున్నాక ఢిల్లీలోనే ఉన్న ఆయ‌న ఆదివారం రాత్రి న‌గ‌రానికి చేరుకోవ‌టం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో కేసీఆర్ ను ప‌రామ‌ర్శించేందుకు బారులు తీరారు. అయితే.. ఎంపిక చేసిన కొద్దిమందికి మాత్ర‌మే ఆయ‌న్ను క‌లిసే అవ‌కాశం ల‌భించింది. ఇదిలా ఉంటే.. ఆప‌రేష‌న్ త‌ర్వాత వైద్యుల సూచ‌న మేర‌కు న‌ల్ల‌క‌ళ్ల‌ద్దాల్ని కేసీఆర్ ధ‌రించారు. ఆదివారం రాత్రి న‌గ‌రానికి వ‌చ్చిన సంద‌ర్భంలోనూ న‌ల్ల‌క‌ళ్ల‌ద్దాలు ఆయ‌న ధ‌రించే ఉంచారు. అయితే.. సోమ‌వారం మాత్రం క‌ళ్ల‌ద్దాల్ని తీసేశారు.

క‌ళ్ల‌ద్దాలు తీసిన వెంట‌నే.. త‌న క‌ళ్ల‌కు వ‌చ్చిన మార్పును గుర్తించిన‌ట్లుగా కేసీఆర్ స‌న్నిహితులు చెబుతున్నారు. న‌ల్ల క‌ళ్ల‌ద్దాలు తీసిన వెంట‌నే.. చూపులో వ‌చ్చిన తేడాను చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది.వెలుగు లేకున్నా స్ప‌ష్టంగా క‌నిపిస్తుంద‌ని.. గ‌తంలో వెలుగులో పెద్ద‌గా క‌నిపించేది కాద‌ని చెప్పిన‌ట్లుగా స‌మాచారం. కంటిచూపు విష‌యంలో ఆయ‌న పూర్తిస్థాయిలో సంతృప్తిని.. సంతోషాన్ని వ్య‌క్తం చేసిన‌ట్లుగా చెబుతున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. త‌న‌ను ప‌రామ‌ర్శించే వారి విష‌యంలో కేసీఆర్ అనుస‌రించిన వైఖ‌రి ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ప్ర‌ముఖులు త‌న‌ను క‌లిసిన సంద‌ర్భంగా.. పరామ‌ర్శ‌ల త‌ర్వాత తాము నిర్వ‌హించిన కార్య‌క్ర‌మానికి రావాల్సిందిగా కోరిన‌ప్పుడు.. వైద్యులు త‌న‌ను రెస్ట్ తీసుకోమ‌న్నార‌ని.. ఆ విష‌యాల మీద మ‌రోసారి మాట్లాడ‌దామ‌ని చెప్పార‌ట‌. కేసీఆర్ నోటి నుంచి అలాంటి స‌మాధానాన్ని ప్ర‌ముఖులు అస్స‌లు ఊహించ‌లేద‌ని చెబుతున్నారు. మొత్తానికి కేసీఆర్ ను ప‌రామ‌ర్శించేందుకు వ‌చ్చిన కొంద‌రికి భిన్న‌మైన అనుభ‌వం ఎదురైన‌ట్లుగా తెలుస్తోంది.
Tags:    

Similar News