తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీ వేదికగా సుదీర్ఘ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత కూడా మరోమారు ఎందుకు సుదీర్ఘంగా క్లారిటీ ఇచ్చారు? మీడియాతో మాట్లాడేందుకు పెద్దగా ఆసక్తి చూపించని కేసీఆర్ తన సొంత మీడియా చానల్ అయిన టీ న్యూస్ లైవ్ లో సుమారు 3 గంటల పాటు ఎందుకు పాల్గొన్నారు? ఈ కార్యక్రమం వెనుక ప్రతిపక్షాలను జీరో చేసే ఎత్తుగడ ఉందా? అంటే అవుననే సమాధానం వస్తోంది.
ప్రాజెక్టుల రీ డిజైనింగ్ అనే కొత్త కాన్సెప్ట్ ను ఎత్తుకున్న కేసీఆర్ ఆ ప్రక్రియను విజయంతంగా పూర్తిచేశారు. అయితే దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. ఒక్కొక్కరికీ క్లారిటీ ఇవ్వడం ఎందుకనే ఉద్దేశంతో సభా వేదికగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ను కేసీఆర్ ఇచ్చారు. అయితే ఈ కార్యక్రమాన్ని బహిష్కరించిన ప్రతిపక్షాలు బయట పలువురు నిపుణులతో కౌంటర్ కామెంట్లు చేయించాయి. కేసీఆర్ చేస్తున్నదంతా అనాలోచితంగా ఉందనే భావనను ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. ఇక కాంగ్రెస్ అయితే ఏకంగా కౌంటర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు శ్రీకారం చుట్టింది.
ఈ నేపథ్యంలో వారికంటే ముందే జాగ్రత్త పడ్డ కేసీఆర్ టీ న్యూస్ వేదికగా తన అభిప్రాయాన్ని పకటించారు. రీ డిజైనింగ్ ఎందుకో మరోమారు స్పష్టం చేశారు. తద్వారా ఇప్పటికే వస్తున్న విమర్శలకు చెక్ పెట్టారు. అదే సమయంలో కాంగ్రెస్ కు ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలియని పరిస్థితి. టీడీపీ విమర్శలే చేయడం లేదు. బీజేపీ - లెఫ్ట్ లయితే ఊసులోనే లేవు అనే సందేశాన్ని ప్రజల్లోకి వెళ్లేలా చేశారు. మొత్తంగా కేసీఆర్ తన రెండో రౌండ్ ద్వారా ప్రాజెక్టుల అంశంపై పై చేయి సాధించడమే కాదు. ప్రతిపక్షాలను కూడా ఒకింత అయోమయంలో పడేశారు అని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి.