శ్రీరామనవమి సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం భద్రాచలం రాములోరి కల్యాణానికి పట్టువస్త్రాలు.. ముత్యాల తలంబ్రాలు అందించటం సంప్రదాయం. అయితే.. ఈ ఏడాది ఈ వ్యవహారంలోకాస్తంత ఛేంజ్ కనిపించింది. ముత్యాల తలంబ్రాల్ని సీఎం నెత్తిన పెట్టుకొని రావటం ఆనవాయితీ. అయితే.. ముఖ్యమంత్రి కేసీఆర్ ముద్దుల తనయుడు హిమాన్షు నెత్తి మీద ముత్యాల తలంబ్రాలు మోసుకురావటం కనిపించింది.
భద్రాచలంలో జరిగే శ్రీరామ కల్యాణోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సతీసమేతంగా ఫాంహౌస్ నుంచి బయలుదేరారు. హెలికాఫ్టర్ లో బయలుదేరిన ఆయన వెంట కేటీఆర్ కుమారుడు.. కేసీఆర్ మనమడు హిమాన్షు కూడా ఉన్నారు. పట్టువస్త్రాలున్న పళ్లాన్ని కేసీఆర్ తన నెత్తిన పెట్టుకోగా.. స్వాముల వారికి సమర్పించే ముత్యాల తలంబ్రాల పళ్లాన్ని హిమాన్షు తన నెత్తిన పెట్టుకొని ఆలయానికి వచ్చారు. కేసీఆర్ మనమడి నెత్తి మీద ఉన్న ముత్యాల తలంబ్రాలను భద్రాచలం పూజారులు అందుకున్నారు. మరి.. ముఖ్యమంత్రి మనమడికి ఆ మాత్రం అవకాశం ఉండదా..?