సంక్రాంతే రిటర్న్‌ గిఫ్ట్‌ కు మంచి ముహూర్తం

Update: 2019-01-07 08:59 GMT
కేసీఆర్‌కు తెలుగు పండగలన్నా, తెలుగు సంప్రదాయాలు అన్నా చాలా ఇష్టం. ముహుర్తాలు, శాస్త్రాల్ని ఆయన నమ్మినంతగా మరెవ్వరూ నమ్మరు. ఇప్పుడు చంద్రబాబుకి రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చేందుకు సిద్ధమైన కేసీఆర్‌.. తెలుగు సంప్రదాయాలకు అనుగుణంగా మంచి ముహూర్తాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. అదే సంక్రాంతి పండుగ.

చంద్రబాబుకి రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తాం అని కేసీఆర్‌ స్టేట్‌మెంట్‌ అయితే ఇచ్చేశారు కానీ.. అదంత ఈజీ కాదనే విషయం ఆయనకు తెలుసు. ఎందుకంటే.. కేసీఆర్‌ నాన్‌లోకల్‌. అంటే లోకల్‌గా ఏం జరుగుతుందో తెలియాలి. లోకల్‌గా ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎవరికి ఓటెయ్యాలనుకుంటున్నారు, ఎవరికి మద్దతిస్తే.. చంద్రబాబుకి చెక్‌ పెట్టినట్లు అవుతుందనే విషయాలపై ఇప్పటికే కేసీఆర్‌ ఆలోచన చేశారు. అందులో భాగంగా.. సంక్రాంతికి పండుగను ఎంచుకున్నారు.

తెలుగు లోగిళ్లలో అతి పెద్ద పండుగ సంక్రాంతి. తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రావాళ్లంతా కచ్చితంగా పండక్కి ఊరు వెళ్లాల్సిందే. ఆంధ్రావారితో పాటు ఇక్కడి సంప్రదాయాలు అంటే ఇష్టపడే కొంతమంది తెలంగాణ మిత్రులు కూడా సంక్రాంతి సంబరాలకు ఆంధ్రాకు వెళ్తుంటారు. సాధారణ ప్రజానీకమే కాదు.. తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ లాంటి నాయకులు కూడా ప్రతీ ఏడాది సంక్రాంతి సంబరాలకు గోదావరి జిల్లాలకు వెళ్తారు. గోదావరి జిల్లాల్లో ఆయనకు మిత్రులు కూడా ఉన్నారు.

ఇక గోదావరి జిల్లాల్లో జరిగే కోడింపందాల గురించి కొత్తగా చెప్పేదముంది. వందల కోట్ల రూపాయలు చేతులు మారతాయి. చిన్నా పెద్దా అందరూ ఊర్లోనే ఉంటారు. దీంతో.. వారి మనసులో ఏముంది అనే విషయం తెలుసుకునే దిశగా.. కొంతమంది వేగుల్ని సంక్రాంతికి పండక్కు ఆంధ్రా పంపించే ఏర్పాట్లలో బిజీగా ఉన్నారట టీఆర్‌ఎస్‌ నాయకులు. అక్కడి నుంచి వచ్చిన సమాచారాన్ని బట్టి.. ఎటునుంచి ఎటు వెళ్తే.. చంద్రబాబుకి పక్కా రిటర్న్‌ గిఫ్ట్‌ రెడీ అవుతుంది అని చూస్తున్నారట. మొత్తానికి చంద్రబాబుకి గిఫ్ట్‌ ఇచ్చేవరకు కేసీఆర్‌ నిద్రపట్టేట్లు లేదు. కేసీఆర్‌ అంతే. ఒక్కసారి కమిట్‌ అయితే.. ఎవ్వరి మాట వినరు.


Full View

Tags:    

Similar News