ఒలింపిక్ విజేత - ఇటీవల జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో రజత పతకం సాధించిన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు తెలంగాణ ప్రభుత్వం అనూహ్యమైన షాక్ ఇచ్చింది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ ఫైనల్ లో తుదికంటా పోరాడి ఓడిన సింధుకు గతంలో హామీ ఇచ్చిన మేరకు బహుమతి ఇవ్వకుండా ట్విస్ట్ ఇచ్చింది. దీంతో అవాక్కవడం సింధు సహా వారి కుటుంబ సభ్యుల వంతు అయిందని చర్చ జరుగుతోంది.
2016 ఒలింపిక్స్ లో పతకం గెల్చినప్పుడు సింధుకు రూ. 5 కోట్ల నగదుతో పాటు హైదరాబాదులో ఇంటి స్థలాన్ని ఇవ్వనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ హామీని పక్కనపెట్టింది. సైనా నెహ్వాల్ కు రూ. 50 లక్షలు - మరో షట్లర్ సిక్కీరెడ్డికి రూ. 30 లక్షలు - రుత్వికా శివానీకి రూ. 20 లక్షలు - బాక్సర్ మహమ్మద్ హుస్సాముద్దీన్ కు రూ. 25 లక్షల బహుమతులను ప్రకటించి పీవీ సింధు పేరును పక్కనపెట్టేసింది. ఆంద్రప్రదేశ్ లో పీవీ సింధు డిప్యూటీ కలెక్టర్ పోస్టును తీసుకున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చని చెప్తున్నారు. కాగా, సింధు తెలంగాణలోనే పుట్టిన పెరిగిన సంగతి తెలిసిందే.
ఇదిలాఉండగా..ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ ఫైనల్ కు చేరి అక్కడ తృటిలో ఓడిపోయినా సందర్భంగా పీవీ సింధును, ఆమె కోచ్ గోపిచంద్ తో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సమావేశం అయిన సంగతి తెలిసిందే. ప్రగతిభవన్‌కు ఆహ్వానించి సింధు - కోచ్ గోపిచంద్ లను సీఎం కేసీఆర్ శాలువాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. మంచి ప్రతిభ కనబరిచావని పేర్కొంటూ ``బెటర్ లక్ నెక్ట్స్ టైం. ఆల్ ద బెస్ట్`` అని ఆమెను సీఎం కేసీఆర్ అభినందించారు. అయితే తాజాగా స్థలం విషయంలో ఈ ట్విస్ట్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.