తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు తెలిసిన ప్రతిఒక్కరికి ముఖ్యమంత్రి కేసీఆర్.. తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డిలకు మధ్యనున్న పంచాయితీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిఒక్కరికి వీరి మధ్యనున్న లొల్లి తెలిసిందే. తాజాగా తెలంగాణ అసెంబ్లీలో వీరి మధ్యన చోటు చేసుకున్న సంఘటన ఆసక్తికరంగా మారింది. తన వాగ్దాటితో పంచ్ లు ఇచ్చే రేవంత్ రెడ్డి నోట మాట రానివ్వకుండానే కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
కేసీఆర్ ప్రసంగానికి రేవంత్ అడ్డు తగిలి ఏదో చెప్పబోయే సమయంలో రేవంత్ ను ఉద్దేశించి కేసీఆర్ స్పందిస్తూ.. ‘‘జెంటిల్ మెన్’’ అంటూ వ్యాఖ్యానించటం విశేషం. గ్రేటర్ ఎన్నికలకు ముందు ఆంధ్ర సెటిలర్లను శత్రువులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని.. 2001లో జలదృశ్యంలో పార్టీ ఆవిర్భవించిన నాడే తాను ఒక విషయంగా స్పష్టంగా చెప్పానంటూ.. ‘‘పొట్టకూటి కోసం వచ్చిన వారితో కాదు.. పొట్ట కొట్టేవారితోనే పంచాయితీ’’ అని వ్యాఖ్యానించారు.
ఈ సమయంలో కేసీఆర్ ప్రసంగానికి రేవంత్ మధ్యలో కల్పించుకొని.. 1926కు ముందు అంటూ ఏదో చెప్పే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ రియాక్ట్ అవుతూ.. ‘‘జెంటిల్ మెన్.. మిస్టర్ రెడ్డి.. ఐ విల్ ఆన్సర్’ అని రేవంత్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కేసీఆర్ మాటకు తెలంగాణ అధికారపక్షం సభ్యులు సరదాగా తీసుకొని.. మీరు చెప్పింది ఆయనకు అర్థం కానట్లుందే అని వ్యాఖ్యానించగా.. కేసీఆర్ రియాక్ట్ అవుతూ గ్రాడ్యుయేట్.. అండర్ స్టాండ్ చేసుకుంటడనే ఇంగ్లిషులో చెప్పా. ఉర్దూలో చెప్పలా అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించి తన ప్రసంగాన్ని కొనసాగించారు. రేవంత్ ను ఉద్దేశించి జెంటిల్ మెన్ అంటూ కేసీఆర్ చేసింది వ్యంగ్యంగానా.. మామూలుగానే అలా అనేశారా? అన్నది ఒక ప్రశ్న. మరోవైపు..జెంటిల్ మెన్ రేవంత్ అని సీఎం సంబోధించినప్పటికీ.. తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడే అవకాశం రాకపోవటం గమనార్హం.