కేజ్రీవాల్ కు కేసీఆర్ వెన్నుపోటు?

Update: 2023-03-06 07:00 GMT
కేసీఆర్.. కేజ్రీవాల్.. ఈ ఇద్దరు సీఎంలు ఇప్పుడు కలిసి సాగుతున్నారు. లిక్కర్ స్కాంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా అరెస్ట్ అయితే కేసీఆర్ ఖండించాడు. అందరూ కలిసి ఓ ఘాటు లేఖ రాశారు. కేసీఆర్ ప్రతిసారి కేజ్రీవాల్ ను కలుపుకుంటూ వెళుతున్నారు.

ఇక్కడి పథకాలు.. అక్కడి పథకాలు చూపిస్తూ ఇద్దరు సీఎంలు కలిసి సాగుతున్నారు. ఈ ఇద్దరూ ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కాంలో కూడా ఇరుక్కుపోయారనే విమర్శలు న్నాయి.

తాజాగా కేసీఆర్ తన పార్టీని విస్తరించే క్రమంలో తన దోస్త్ కేజ్రీవాల్ పార్టీకి ఎసరు తెస్తున్నాడని తెలుస్తోంది. ఇతర రాష్ట్రాలలో విస్తరించే క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలను చేర్చుకోవడం విమర్శలకు తావిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలను బీఆర్ఎస్ లో చేర్చుకున్నా ఆ పార్టీ నుంచి కేసీఆర్ పై ఇంతవరకూ విమర్శలు రాకపోవడం గమనార్హం.

మాజీ ఎంపీ, ఆమ్ ఆద్మీ పార్టీ మహారాష్ట్ర యూనిట్ వైస్ ప్రెసిడెంట్ హరి భావు రాథోడ్ శనివారం ఇక్కడ భారత రాష్ట్ర సమితిలో చేరారు. ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు ఆయనకు లాంఛనంగా పార్టీలోకి స్వాగతం పలికారు.

హరి భావు రాథోడ్‌తో పాటు, ఇతర పార్టీల నుండి కూడా కొంతమంది నాయకులు బీఆర్ఎస్ లో చేరారు. చంద్రాపూర్ జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ సందీప్ కరాపే, బీజేపీ నుంచి గోండ్ పిప్రీ నగర్ సేవక్ తాలూకా అధ్యక్షుడు బాబాన్ నిఖోడ్, శివసేన తాలూకా సమన్వయకర్త ఫిరోజ్ ఖాన్, బీజేపీ నాయకుడు శైలేష్ సింగ్ కూడా ముఖ్యమంత్రి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు.

ఇలా బీఆర్ఎస్ విస్తరణకు ఆప్ లోని కీలక నేతలను చేర్చుకుంటూ తన ఫ్రెండ్ కేజ్రీవాల్ కు కేసీఆర్ ఝలక్ ఇస్తున్నాడని పలువురు కౌంటర్లు ఇస్తున్నారు.       


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News