ఎవరైనా ఒక వ్యక్తికి బర్త్ డే విషెస్ చెబితే రికార్డుల్లోకి ఎక్కటం సాధ్యమేనా? అంటే.. నో చెప్పేస్తారు. కానీ.. అది సాధ్యమేనని ఫ్రూవ్ చేశాడో వ్యక్తి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్ డే సందర్భంగా వినూత్నంగా విషెస్ చెప్పిన ఆయన అభిమాని ఒకరు రికార్డుల్లోకి ఎక్కేసిన వైనం ఆసక్తికరమే కాదు.. అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఏదో మాట వరసకు విషెస్ చెప్పామంటే.. చెప్పామన్నట్లు కాకుండా.. అందుకోసం సదరు అభిమాని పడిన కష్టం చూస్తే.. షాకింగ్ గా అనిపించటమే కాదు.. ఇది సాధ్యమేనా? అన్న భావన కలగటం ఖాయం. ఈ కారణంతోనే బర్త్ డే విషెస్ కు రికార్డు దక్కిందని చెప్పక తప్పదు. ఇంతకీ.. కేసీఆర్ కు బర్త్ డే విషెస్ చెప్పిన వ్యక్తి రికార్డుల్లోకి ఎలా ఎక్కారన్నది చూస్తే..
డీవీఆర్ ప్రసాద్ అనే వ్యక్తికి కేసీఆర్ అంటే అభిమానం. అందరి మాదిరి కాకుండా ఆయన బర్త్ డే సందర్భంగా వినూత్నంగా శుభాకాంక్షలు చెప్పాలనుకున్నాడు. ఇందుకోసం చాలానే ఆలోచించాడు. కేసీఆర్ బర్త్ డే అయిన ఫిబ్రవరి 17తో పాటు.. ఆయన పుట్టిన సంవత్సరమైన 1954 వచ్చేలా కరెన్సీ నోట్లను సేకరించటం షురూ చేశారు.
అంటే.. కేసీఆర్ బర్త్ డేట్.. ఇయర్ అయిన (170254) నెంబరున్న కరెన్సీ నోట్లను సేకరించారు. ఒకటి.. రెండు.. ఐదు.. పది.. ఇరవై.. యాభై.. వంద నోట్లను సేకరించారు. అన్ని నోట్ల మీదా 170254 ఉండటం విశేషం.
ఇలా.. వినూత్నంగా బర్త్ డే విషెస్ చెప్పిన తీరుకు హైరేంజ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు లభించింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి వినూత్నంగా బర్త్ డే విషెస్ చెప్పిన వైనం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పుడు ప్రసాద్ చెప్పిన వినూత్న విషెస్ పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది. తనకు విషెస్ చెప్పటం కోసం ప్రసాద్ తపించిన వైనానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.