కేసీఆర్ కి కూడా ప్రత్యేక మైందే కావాలట!

Update: 2015-09-01 04:36 GMT
రాజకీయాల్లో విమర్శలూ ప్రతి విమర్శలూ సహజంగా జరిగేవే కానీ... కొన్ని విమర్శలు మాత్రం ప్రత్యర్ధిపార్టీపై కానీ, ప్రత్యర్ధి నాయకుడిపై కానీ చేసిన అతితక్కువ అసమయంలోనే రివర్స్ కొడుతుంటాయి. ఇది చాలా సందర్భాల్లో జరుగుతుంటుంది కానీ... ఇప్పుడు చెప్పుకోబోయే విషయంలో మాత్రం కాస్త తొందరగానే జరిగింది.

ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఏర్పడిన సమస్యలనుండి గట్టెక్కే క్రమంలో.. రాజధాని నిర్మాణానికని, కొత్త కొత్త పరిశ్రమల స్థాపనకని, విదేశీ పెట్టుబడులను ఆకర్షించే క్రమంలో విదేశీప్రయాణాలు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు! ఇది ఒక్కడిగా చేసే ప్రయాణం కాదు కాబట్టి.. అవసరమైన బృందాన్ని వెంటపెట్టుకుని వెళ్లేవారు! దీనిపై ప్రత్యేక విమానంలో విదేశాలకు చెక్కేయడమే బాబుపని.. మామూలు ఫ్లైట్స్ లో వెళ్లొచ్చు కదా... ప్రత్యేక విమానాలు అవసరమా... సామాన్యుడు తిండికి లేక ఇబ్బందిపడుతుంటే బాబుకి మాత్రం స్పెషల్ ఫ్లైట్స్ కావాలంట అని విమర్శించేవారు.

తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా విదేశీ పర్యటనలకు సిద్దమయ్యారు. ఇందులో భాగంగా తన బృందంతో కలిసి చైనా వెళ్లనున్నారు. ఈ సందర్భంలో కేసీఆర్ కూడా ప్రత్యేక విమానానికే ప్రాధాన్యమిచ్చారు. ఈ క్రమంలో సెప్టెంబరు 8 నుంచి 16వరకూ చైనాలో పర్యటించనున్న కేసీఆర్ అండ్ కో కోసం ఏర్పాటు చేసిన సి.ఆర్.జె. ఛార్టర్డ్ విమానం అద్దె ఎంతో తెలుసా? అక్షరాలా 2కోట్ల మూడు లక్షల 84వేల రూపాయలు (రూ.2,03,84,000)!
Tags:    

Similar News