తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ సమ్మర్ టూర్ మాజోరుగా సాగుతోంది. కుటుంబసభ్యులతో కలిసి కేరళ ట్రిప్ కు వెళ్లిన ఆయన.. ఓపక్క టెంపుల్స్ ను సందర్శించటమే కాదు.. కేరళ ముఖ్యమంత్రితో ఫెడరల్ ఫ్రంట్ చర్చలు జరిపిన వైనం తెలిసిందే. వెంట పార్టీ నేతల్ని తీసుకెళ్లిన ఆయన.. రెండో రోజు నాటికి అందరిని పంపేయటం.. పర్సనల్ ట్రిప్ ను కొనసాగిస్తున్నారు.
కేరళలో ట్రిప్ పూర్తి చేసుకున్న ఆయన.. తాజాగా తమిళనాడుకు చేరుకున్నారు. కేరళ నుంచి కేసీఆర్ ఫ్యామిలీ కన్యాకుమారికి వెళ్లారు. అక్కడ టెంపుల్ కు వెళ్లిన ఆయన.. సూర్యాస్తమయాన్ని వీక్షించినట్లుగా తెలుస్తోంది. అనంతరం రామేశ్వరం వెళ్లనున్న కేసీఆర్.. పనిలో పనిగా మధురై కూడా వెళతారని చెబుతున్నారు.
ఇక్కడితో టూర్ పూర్తి కాదని.. ఆ తర్వాత పాండిచ్చేరికి కూడా వెళ్లవొచ్చని చెబుతున్నారు. మొత్తానికి మంట పుట్టించే సమ్మర్ లో అంతా ఫారిన్ టూర్లకు వెళుతుంటే.. కేసీఆర్ మాత్రం కుటుంబ సభ్యులను తీసుకొని దక్షిణ దేశ తీర్థయాత్రల మాదిరి షెడ్యుల్ ను తయారు చేసుకున్నట్లుగా కనిపించక మానదు. చూస్తుంటే.. తాజా ఛాయిస్ ఆయనదా? ఆయన మనమళ్లు.. మనమరాళ్లదా..?