రెవెన్యూపై వార్.. టైం ఫిక్స్ చేసిన కేసీఆర్

Update: 2019-04-03 04:50 GMT
మొండోడు రాజు కంటే బ‌ల‌వంతుడు అంటారు. మ‌రి.. రాజే మొండోడు అయితే?  తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితే నెల‌కొంది. త‌న‌కు న‌చ్చ‌ని విష‌యం ఎంత పెద్ద‌దైనా.. ఎంత ఇబ్బందులు ఎదురైనా.. వెన‌క‌డుగు వేయ‌కుండా ప్ర‌క్షాళన చేయాల‌న్న ప్ర‌య‌త్నం చేస్తుంటారు కేసీఆర్‌. ఇప్పుడు ఆయ‌న క‌న్ను రెవెన్యూ శాఖ మీద ప‌డింది. భూములు.. వాటి ప‌ట్టాల విష‌యంలో ఎదుర‌య్యే స‌మ‌స్య‌ల‌కు శాశ్వితంగా చెక్ పెట్టేలా టెక్నాల‌జీని ఉప‌యోగించాల‌న్న మాట‌ను ఈ మ‌ధ్య‌నే కేసీఆర్ చెప్పారు.

ఈ సంద‌ర్భంగా తాను తీసుకొచ్చే మార్పుల‌కు రెవెన్యూ అధికారులు రోడ్ల మీద‌కు వ‌స్తార‌ని.. ఆ సంద‌ర్భంగా ప్ర‌జ‌లే అండ‌గా నిల‌వాలంటూ శ‌ర‌త్ ఫోన్ కాల్ సంద‌ర్భంగా కేసీఆర్ చెప్ప‌టం తెలిసిందే. రెవెన్యూ అధికారుల‌కు రూపాయి ఇవ్వొద్దంటున్న కేసీఆర్ మాట‌లు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి.

పోడు భూములు.. ప‌ట్టా భూముల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం చేసేందుకు తానే స్వ‌యంగా రంగంలోకి దిగ‌నున్న‌ట్లుగా కేసీఆర్ తాజాగా వెల్ల‌డించారు. ఎన్నిక‌ల త‌ర్వాత ప్ర‌జాద‌ర్బారు ఏర్పాటు చేసి రెవెన్యూ స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రిద్దామ‌న్న ఆయ‌న‌.. అందుకు ధ‌ర‌ణి వెబ్ సైట్ ను తీసుకురానున్న‌ట్లు చెప్ప‌టం తెలిసిందే. ఇప్పుడు అదే విష‌యంపై మ‌రింత క్లారిటీ ఇచ్చిన ఆయ‌న‌.. ఆ మార్పున‌కు ముహుర్తాన్ని చెప్పేశారు.

కేసీఆర్ మాట‌ల్ని చూస్తే.. ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన వెంట‌నే రెవెన్యూ లో సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్టే విష‌యంలో వెన‌క్కి త‌గ్గేది లేద‌ని తాజాగా మ‌రోసారి తేల్చేశారు. రెండు నెల‌లు ఆగితే.. భూస‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం దొరుకుతుంద‌న్న కేసీఆర్‌.. ఎన్నిక‌ల త‌ర్వాత రాష్ట్రంలో మార్పులు వ‌స్తున్న‌ట్లు చెప్పారు. కొత్త రెవెన్యూ చ‌ట్టాన్ని తీసుకురానున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. కొత్త చ‌ట్టంతో రెవెన్యూ ఉద్యోగుల‌కు చుక్క‌లు చూపిస్తాయ‌న్న మాట ఇప్ప‌టికే వినిపిస్తోంది. కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌భుత్వ ఉద్యోగుల్లోని బ‌ల‌మైన వ‌ర్గానికి కోపం వ‌చ్చే నిర్ణ‌యాల్ని అదే ప‌నిగా ప్ర‌క‌టించ‌టం చూస్తే.. కేసీఆర్ ఎంత మొండోడ‌న్న విష‌యం అర్థం కాక మాన‌దు. 

కొత్త రెవెన్యూ చ‌ట్టం ఎలా ఉంటుంద‌న్న విష‌యంపై ఇప్ప‌టికే టీజ‌ర్ మాట‌ల్ని చెప్పేసిన కేసీఆర్‌.. సినిమా రిలీజ్ ముహుర్తాన్ని తాజాగా చెప్పేశారు. సో.. ఎన్నిక‌ల యుద్ధం పూర్తి కాగానే మ‌రో యుద్ధానికి సిద్ధ‌మ‌వుతున్న కేసీఆర్ గుండె ధైర్యాన్ని మెచ్చుకోక త‌ప్ప‌దు.
Tags:    

Similar News