ప్రత్యర్థికి అంతుచిక్కని వ్యూహాలతో చెలరేగిపోయే రాజకీయ వ్యూహకర్తగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు పేరుంది. ఆయన ఒకసారి వ్యూహం సెట్ చేస్తే.. దాని లెక్కను అర్థం చేసుకోవటానికి రాజకీయ ప్రత్యర్థులు నానా పాట్లు పడతారని చెబుతారు. ఎంతటి కోడ్ ను అయినా డీ కోడ్ చేయటం ఐటీ రంగంలో మామూలే. రాజకీయాలకు ఇది వర్తిస్తుందని చెప్పాలి. ఏళ్లకు ఏళ్లుగా రాజకీయాలు చేస్తున్న కేసీఆర్ ను మ్యాప్ చేసేందుకు రాజకీయ పార్టీలు ఎంతగానో కసరత్తు చేస్తున్నాయి. ఆ ప్రయత్న ఫలితమే దుబ్బాక ఉప ఎన్నికగా చెప్పాలి.
తాజాగా బీజేపీ అదే రూట్లో ప్రయాణిస్తోంది. భావోద్వేగ అంశాల్ని ప్రస్తావిస్తూ.. వాటిపై తప్పనిసరిగా స్పందించాల్సిన పరిస్థితిని తీసుకొస్తోంది.దుబ్బాకలో కానీ తాజా గ్రేటర్ ఎన్నికల ప్రచారాన్ని చూస్తే.. పెద్దసారు.. చిన్నసారు మాటలకు బీజేపీ నేతలు కౌంటర్ ఇవ్వటం లేదు. కమలనాథుల స్టేట్ మెంట్లకు కిందామీదా పడిపోతూ.. కేసీఆర్.. కేటీఆర్ లు సమాధానాలు ఇవ్వటం కనిపిస్తుంది.
అంటే.. ఎన్నికల ఎజెండాను.. ప్రచార ఎజెండా మొత్తం బీజేపీ కోరుకున్నట్లే జరుగుతున్నట్లు. మరీ.. విషయాన్ని పెద్ద సారు ఎందుకు పట్టించుకోవటం లేదు? అన్నది ప్రశ్న. ఏమైనా.. కేసీఆర్ ను తమ వ్యూహంలో భాగస్వామ్యం చేయటం ద్వారా ఒకింత అధిక్యతను అయితే బీజేపీ ప్రదర్శిస్తుందని చెప్పక తప్పదు. మరీ.. విషయాన్ని గుర్తించి.. తానే ఎజెండాను డిసైడ్ పరిస్థితిని కేసీఆర్ ఎప్పటికి తీసుకొస్తారో?
ఆ ఉప ఎన్నికల్లో కేసీఆర్ తప్పుల్ని తమకు అనుకూలంగా మార్చుకోటంతోనే సంచలన గెలుపు సాధ్యమైందని చెప్పక తప్పదు. దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారాన్ని చూస్తే.. బీజేపీ వ్యూహకర్తల తెలివిని మెచ్చుకోకుండా ఉండలేం. ఎందుకంటే.. కేసీఆర్ రాజకీయం ఎప్పుడూ తనదే పైచేయి ఉండేలా చేయటమే కాదు.. భావోద్వేగంతో ఎజెండాను ఫిక్స్ చేస్తుంటారు. దీనికి తగ్గట్లే ఆయన ఇప్పటికే ఫలితాన్ని పొందారు.