తెలంగాణ ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కేంద్రంపై కాలు దువ్వేందుకు సిద్ధమయ్యారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో మొండిచేయి చూపడంతో కస్సుమన్న కేసీఆర్ ఢిల్లీ వేదికగా తన గళం వినిపించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆయన కొన్ని షరతులు విధించుకున్నారు. ఈ విషయాలను తన పార్టీ ఎంపీలతో చర్చించారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో ప్రగతిభవన్‌లో మంత్రులు - ఎంపీలు - ఉన్నతాధికారులతో సీఎం శనివారం సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన హితోపదేశం చేశారు.
మద్దతు ధర విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాబట్టుకోవాలని.. ప్రతీ పంటకు ఇవ్వబోయే మద్దతు ధర సభలో ప్రకటించేలా అడగాలని సీఎం కేసీఆర్ టీఆర్ ఎస్ ఎంపీలకు సూచించారు. ఈ భేటీలో రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు - రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయదారులకు అమలు చేస్తున్న పథకాలు - రైతులకు ఉచిత విద్యుత్ సౌకర్యం - విత్తనాలు-ఎరువుల పంపిణీ - సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం - రైతులకు పెట్టుబడి పథకం - రైతు సమన్వయ సమితుల ఏర్పాటు తదితర అంశాలపై సీఎం చర్చించారు. బడ్జెట్ సమావేశాల్లో టీఆర్ ఎస్ ఎంపీలు లేవనెత్తాల్సిన అంశాలపై సీఎం కేసీఆర్ సూచనలు చేశారు.
ఇంత వరకు కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి చేసి సహాయానికి కృతజ్ఞతలు తెలియజేస్తూనే అందాల్సిన సహాయం విషయంలో పట్టుబట్టాలని కేసీఆర్ ఆదేశించారు. రైతుల సమస్యలను పార్లమెంట్ లో లేవనెత్తాలని చెప్పారు. రిజర్వేషన్లు - కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాతో పాటు మిషన్ భగీరథ - వరంగల్ టెక్స్ టైల్ పార్క్ కు నిధులు సమకూర్చే విషయంపై ప్రస్తావించాలన్నారు. ఎన్ ఆర్ ఈజీఎస్ ను వ్యవసాయంతో అనుసంధానం చేయాల్సిన విషయం, సహకార సమాఖ్య స్ఫూర్తికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అంశాలను ఉభయ సభల్లో ప్రస్తావించాలని ఎంపీలకు సూచించారు.