హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన చాలా రోజుల తర్వాత భేటి అయిన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. రెండున్నర గంటల పాటు ఈ సమావేశం జరిగింది.
ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం కుర్చీ మార్పు అంటూ కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారంపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు.
తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని.. తానే సీఎంగా ఉంటానని కేసీఆర్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి మార్పుపై ఎందుకలా ఇష్టమున్నట్టు మాట్లాడుతున్నారని వ్యాక్యానించారు.
ఫిబ్రవరి 12 నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని.. ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం వరకు పూర్తి చేసి ఘనంగా పార్టీ పండుగను నిర్వహిద్దామని శ్రేణులకు పిలుపునిచ్చాడు.