ఎవరి మాట వినని టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కు సలహాలు.. సూచనలు ఇచ్చే వారు ఉన్నారా? అంటే అవునని చెబుతున్నారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో చెబితే షాక్ తినాలే. ఎవరి అంచనాలకు అందని రీతిలో ఉండే ఆయన ఎవరో కాదు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీగా చెబుతున్నారు. కేసీఆర్ తో సీటుకు సంబంధించిన సంప్రదింపులు కానీ.. సిఫార్సు కానీ చేయాలంటే అసద్ కు మించిన ఛానల్ మరొకటి ఉండదన్న మాట ఇప్పుడు జోరుగా వినిపిస్తోంది.
ఇంతకీ కేసీఆర్ కుఅసద్ అంటే అంత ప్రయారిటీ ఎందుకు? సొంత వాళ్లకు కూడా సందు ఇవ్వని కేసీఆర్.. అసద్ కు ఎందుకంతగా నమ్ముతారు? ఆయన మాటకు ఎందుకు ప్రయారిటీ ఇస్తారు? అంటే.. ఓటుకు నోటు వ్యవహారమేనని చెబుతారు.
ఢిల్లీ నుంచి కేసీఆర్ కు ఓటుకు నోటుకు సంబంధించిన కుట్రకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చి అలెర్ట్ చేయటంతో కేసీఆర్ ఫిదా అయిపోయారని.. అప్పటి నుంచి అసద్ ను తన సొంత మనిషితో సమానంగా చూస్తారని.. ఆయన మాటకు చాలా వరకూ ప్రయారిటీ ఇస్తారని చెబుతున్నారు. అలా అని.. అసద్ అడిగినవన్నీ.. చెప్పినవన్నీ చేస్తారని చెప్పటం లేదు కానీ.. మిగిలిన వారితో పోలిస్తే.. అసద్ కు ప్రయారిటీ ఉంటుందన్న మాట చెప్పక తప్పదు.
మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కేసీఆర్ కు సలహాలు.. సూచనలు ఇచ్చేందుకు ఆయన తరచూ కమిటీ వేస్తుంటారు. కానీ.. ఆ కమిటీలు అంతిమంగా తీసుకునే నిర్ణయం కేసీఆర్ డిసైడ్ చేసిందేనని చెబుతారు. ఆయనకు సన్నిహితంగా ఉండటం అంటే కత్తి మీద సాముగా అభివర్ణిస్తారు.
అదే పనిగా సలహాలు.. సూచనలు ఇచ్చే వారిని పక్కన పెట్టేయటమే కాదు.. దగ్గరకు కూడా రానివ్వరని చెబుతారు. అలాంటి అసద్ విషయంలో మాత్రం కాస్త మినహాయింపు ఉంటుందని చెబుతారు. కేసీఆర్ తనకిచ్చే మర్యాదను.. అసద్ ఎప్పుడు పోగొట్టుకోరని.. ఆయన కూడా హుందాగా ఉంటారని చెబుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. టీఆర్ ఎస్ కు చెందిన కొందరు నేతలు.. తమ టికెట్ల విషయంలో అసద్ చేత సిఫార్సు చేసుకుంటున్న వైనం ఈ మధ్యన పార్టీలో ఆసక్తికర చర్చగా మారింది. కుటుంబ సభ్యులకు కూడా లభించని అవకాశం అసద్ కుఉందన్న మాట కొందరు గులాబీ నేతలు వ్యాఖ్యానించటం గమనార్హం.