టీఆర్ ఎస్ ఏర్పడిన నాటి నుంచి ఉప ఎన్నికలను నిచ్చెనలుగా వాడుకుంటూ పార్టీకి బలమైన పునాదులు వేసుకున్న గులాబీ దళపతి కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో కూడా అదే అడుగులు వేస్తున్నారా? తాజా పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ మరో ఉప ఎన్నికకు రంగం సిద్ధం చేసుకున్నారా? ఈ దఫా పార్లమెంటు నియోజకవర్గాలపై ఆయన పాచిక వేయనున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇటీవలి పరిణామాలు ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయని చెప్తున్నారు.
టీడీపీకి చెందిన మల్కాజ్ గిరి ఎంపీ మల్లారెడ్డి ఇటీవలే టీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. నల్గొండ కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ నెల 15న టీఆర్ ఎస్ లో చేరేందుకు ముహూర్తం ఖరారయింది. రాజకీయ పునరేకీకరణ పేరుతో వలసలను ప్రోత్సహిస్తున్నప్పటికీ ఇతర పార్టీలను బలహీనం చేసేందుకే అనేది రాజకీయవర్గాల భావన. ఈ నేపథ్యంలో ఇద్దరు ఎంపీలపై లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేసేందుకు కాంగ్రెస్ - టీడీపీలు సిద్దమవుతున్నాయి.ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న టీడీపీ మల్కాజ్ గిరి ఎంపీపై ఫిర్యాదు చేసేందుకు మొగ్గు చూపుతుందని సమాచారం. లోక్ సభలో ప్రతిపక్ష స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడ గుత్తా సుఖేందర్ రెడ్డిపై పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఫిర్యాదు చేస్తామని చెబుతుంది. దీనిపై బీజేపీ పెద్దలు కూడ చర్య తీసుకునేందుకు ఆసక్తిగా ఉండే క్రమంలో వీరిపై త్వరలోనే అనర్హత వేటు పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇదే సమయంలో రాష్ట్రం ఏర్పడిన తరువాత బంగారు తెలంగాణ సాదనలో కూడ ఉప ఎన్నికల ఫార్ములాను కొనసాగించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా చేసి క్యాబినేట్ లోకి తీసుకుంటారన్న ప్రచారం జరుగుతుండం ఇందుకు బలం చేకూరుస్తోంది. నల్గొండ పార్లమెంటు సభ్యుడిగా మరో నేతకు అవకాశం కల్పిస్తారని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. మల్కాజ్‌గిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో తిరిగి ఎంపీగా పోటీచేసేందుకు మల్లారెడ్డి సిద్దమవుతున్నారని సమాచారం. ఈ రెండు స్థానాలలో ఉప ఎన్నికలు ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని పార్టీ క్యాడర్ కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారని తెలుస్తోంది. ఇదిలాఉండగా పార్టీ మారిన క్రమంలో తమపై అనర్హత వేటు పడితే దానికి సిద్దంగా ఉన్నామని ఎంపీ మల్లారెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు నల్గొండ పార్లమెంటుకు తిరిగి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టత ఇచ్చారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికలలోను టీఆర్ ఎస్ ఘన విజయం సాదించిన ఒరవడిని ఈ రెండు ఉప ఎన్నికలలో కొనసాగించాలన్న పట్టుదలతో సీఎం కేసీఆర్ ఉన్నారని అంటున్నారు. 2019 సాధారణ ఎన్నికల నాటికి టీఆర్ ఎస్ కు ఉన్న పాజిటివ్ టెంపోను కొనసాగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలగా ఉన్నారనేది మొత్తంగా ఆయన ఎత్తుగడల సారాంశం.