పేదోడికి డబుల్ బెడ్రూం ఇంటిని ఉచితంగా ఇచ్చే తెలంగాణ లాంటి ధనిక రాష్ట్రంలో ఆ రాష్ట్ర జీత భత్యాలు ఏ స్థాయిలో ఉండాలి. పేదోళ్లకు ఏదో గూడు కాకుండా ఓ రేంజ్ ఇంటినే ఇస్తున్నప్పుడు.. తెలంగాణ ప్రజలకు సేవ చేసేందుకు అహర్నిశలు కష్టపడే ఎమ్మెల్యేలకు తగినంత జీతం ఇవ్వాలి కదా? ఆ మధ్యన ఎమ్మెల్యేల జీతాలు తక్కువగా ఉన్నట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఫీలైన నేపథ్యంలో జీతాలు పెరగకుండా ఉంటాయా?
ఎమ్మెల్యేలు కోరుకోవటం.. ముఖ్యమంత్రి సానుకూలంగా ఉండటంతో తాజాగా జరిగిన శాసనసభ్యుల సౌకర్యాల కమిటీ.. ఎమ్మెల్యేల జీతాల పెంపు మీద సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం.. ఇప్పటివరకూ ఉన్న ఎమ్మెల్యేల నెలసరి జీతం రూ.1.25 లక్షల నుంచి రూ.3.5లక్షలకు పెరగనుంది. ఇక.. ఎమ్మెల్యేలకు ఇచ్చే వెహికిల్ లోన్ ను రూ.15 లక్షల నుంచి రూ.40 లక్షలకు పెంచనున్నారు.
ప్రస్తుతం ఎమ్మెల్యేలకు మాత్రమే తీపికబురుగా కాకుండా.. గతంలోని ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీగా పని చేసిన మాజీలకు సైతం రూ.50వేలుగా ఉన్న పింఛన్ ను రూ.65 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు.. మాజీ ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు మరణించిన పిదవ.. వారి సతీమణులకు అంతే పింఛన్ ను.. ఇతర సౌకర్యాల్ని కూడా అందించాలన్న చక్కటి నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇక.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలకు పరిమితి లేని వైద్య సౌకర్యాన్ని పెంచేలా నిర్ణయం తీసుకున్నారు.
అనుకుంటాం కానీ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనసున్న మారాజుగా చెప్పుకోవాలి. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు అందరూ కాకున్నా.. కొందరైనా.. నీతిగా నిజాయితీగా.. తమ ధర్మం ప్రకారం విధులు నిర్వర్తిస్తుంటారు. కానీ.. కొందరు సంపాదించుకునే నేతల్ని చూసి.. వారికి కల్పించే సౌకర్యాల మీద పెద్దగా దృష్టి పెట్టని ప్రభుత్వాల కారణంగా.. మంచిగా ఉండే నేతలు తమ పదవీ విరమణ తర్వాత పడుతున్న పాట్లు ఏన్నో. అలాంటి వారికి.. తాజాగా తీసుకున్న నిర్ణయాలు ఊరటనిస్తాయని చెప్పక తప్పదు.