మంగళవారం ఉదయం కింగ్ ఫిషర్ లైట్ బీర్ కోసం వైన్ షాపు వద్దకు వెళ్లి రూ.100 చెల్లించిన మందుబాబుకు షాక్ తగిలింది. 120 రూపాయలు అని షాప్ వాడు చెప్పేసరికి ఎమ్మార్పీ కంటే 20 ఎక్కువ వసూలు చేస్తావా అని గొడవ చేశాడు. 'ఎమ్మార్పీ రేటే ఇదీ.. కేసీఆర్ సర్కారు మద్యం ధరలను ఈరోజు నుంచి పెంచింది' అని షాప్ వాడు చెప్పేసరికి మందుబాబులకు షాక్ తగిలింది.
ఆర్థిక మాంద్యం కమ్మేసింది. అమ్మకాలు పడిపోయాయి. భారీ పథకాలు ప్రారంభించిన కేసీఆర్ ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాడు. బిల్లులన్నీ ఆపేశాడు. రోజు గడిచేవాటికే రిలీజ్ చేస్తున్నాడు. పథకాలు లేవు, ప్రాజెక్టులు లేవు. ఆర్థిక కష్టాలతో తెలంగాణ అతలాకుతలం అవుతోంది. ఏం చేయాలని బాగా ఆలోచించిన కేసీఆర్ ఎట్టకేలకు తెలంగాణకు ఘననీయంగా ఆదాయం తెచ్చిపెడుతున్న మందుబాబులనే నమ్ముకున్నారు. తాగేటోళ్లపై భారం మోపం మోపాడు. మీరే తెలంగాణ ఆర్థిక భారాన్ని మోయాలని వేడుకున్నాడు. మంగళవారం నుంచి తెలంగాణలో మద్యం ధరలను భారీగా పెంచేసి కేసీఆర్ సారు కిక్కును కాస్లీ చేశాడు.
బీర్, చీప్ లిక్కర్, విస్కీ, స్కాచ్ ఇలా కాదేదీ పెంచడానికి అనర్హం అన్నట్టు కేసీఆర్ సారు అన్నింటి ధరలను తెలంగాణలో పెంచేశారు. ఒక్క చీప్ లిక్కన్ మాత్రమే వదిలేశారు. మద్యం ధరలు తెలంగాణలో భారీగా పెరిగాయి. హాఫ్ బాటిల్ పై రూ.40, ఫుల్ బాటిల్ పై 80, బడా బాబులు తాగే ఖరీదైన మద్యం, స్కాచ్ పై 150 వడ్డించాడు. కొత్త ధరలను మంగళవారం నుంచే అమల్లోకి తెచ్చాడు. అదనపు ఎక్సైజ్ డ్యూటీ పేరిట మందుబాబులను పిండేసే ప్రోగ్రాంను ప్రవేశపెట్టాడు.
తెలంగాణలో భారీగా పెంచిన మద్యం ధరలతో కేసీఆర్ సర్కారుకు అదనంగా ఏడాదికి ఏకంగా 3600 కోట్ల ఆదాయం వస్తుంది. కేసీఆర్ సర్కారు గడిచిన రెండేళ్లలోనే మళ్లీ ధరలు పెంచడం గమనార్హం. 2017 డిసెంబర్ లోనే ఎక్సైజ్ శాఖ ధరలను పెంచింది. మల్లీ ఇప్పుడు చీప్ లిక్కర్ మినహా మిగిలిన బ్రాండ్ల ధరలను పెంచింది.
ఇవేకాదు.. ప్రజలు వివిధ సందర్భాల్లో నిర్వహించుకునే పార్టీలు, ఈవెంట్లు, క్లబ్బుల్లో చేపట్టే మద్యం పార్టీలకు భారీగా లైసెన్స్ ఫీజులను సర్కారు పెంచింది. ప్రస్తుతం హైదరాబాద్ లో 9000 ఉన్న ఈవెంట్ ధరను తాజాగా 12000 కు పెంచారు. ఇక ఖరీదైన హోటల్స్ లో పార్టీలకు ఏకంగా 20వేలకు పెంచారు. ఇలా తెలంగాణలో మద్యం బాబులకు మంగళవారం ఉదయమే షాకిచ్చారు కేసీఆర్.