తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ - ఆ పార్టీ డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపుగా ఖరారైపోయింది. నవంబర్ 9 లేదా డిసెంబర్ 9న రేవంత్ సైకిల్ పార్టీకి టాటా చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని అంటున్నారు. ఈ పరిణామం ఇటు తెలుగుదేశం పార్టీలో అటు కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ నేతను కోల్పోవడం టీడీపీ నష్టం కాగా...సీనియర్ నేత పార్టీలోకి రావడం తమకు బలంగా కాంగ్రెస్ భావిస్తోంది. అయితే...ఈ పరిణామంపై అధికార టీఆర్ ఎస్ పార్టీ - తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందన ఏంటనేది అందరిలో ఆసక్తికరంగా మారింది.
టీఆర్ ఎస్ పార్టీలోని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రేవంత్ రెడ్డి పార్టీ ఫిరాయింపు - ఆయన చేస్తున్న కామెంట్లపైనా ఇప్పుడే స్పందించాల్సిన అవసరం లేదు అని ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పార్టీ నేతలను ఆదేశించారని తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ రకంగా స్పందించినా ఇక్కడున్న ఏపీ ప్రజలను దూరం చేసుకున్నట్టు అవుతుందని, అందుకే జాగ్రత్తగా ఉండాలని కేసీఆర్ నేతలకు చెప్పినట్టు తెలిసింది. ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పందించేంత వరకు బహిరంగ వ్యాఖ్యలు చేయడానికి వీల్లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ నేతలకు సూచించినట్టు సమాచారం. దీంతో రేవంత్ రెడ్డి పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో టీఆర్ ఎస్ పార్టీ వేచి చూసే ధోరణిని అవలంబిస్తోంది.
మరోవైపు టీడీపీ - టీఆర్ ఎస్ పార్టీల మధ్య పొత్తులు ఉంటాయని ప్రచారం జరుగుతున్నా - దానిపై స్పందించడానికి టీఆర్ ఎస్ నేతలు నిరాకరిస్తున్నారు. ఇంకా తెలంగాణలో పూర్తిగా టీడీపీ ఓటింగ్ చెదిరిపోలేదన్నది టీఆర్ ఎస్ పార్టీ నాయకత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో ఏం చేస్తే బాగుంటుందనేది ఆ పార్టీ నేతలు ఆలోచన చేస్తున్నారు. టీడీపీ నుంచి టీఆర్ ఎస్ లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు - ఎర్రబెల్లి దయాకరరావు వంటి నేతలు టీడీపీ నేతలతో సత్సంబంధాలు పెట్టుకున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే అతిగా స్పందించవద్దని పార్టీ నేతలకు పెద్దల నుంచి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం.