రాష్ట్రం బాగు కోసం దేని కైనా సై అంటారు కేసీఆర్. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, ప్రజలు రాష్ట్రం బాగుంటుంది అంటే ఎన్ని యాగాలు చేసేందుకైనా సిద్ధమవుతారు. మొన్నటికి రాజ శ్యామల యాగం చేశారు. గతంలో ఆయుత చండీ మహాయాగం చేశారు. ఇప్పుడు మహారుద్ర సహిత సహస్ర చండీ మహాయాగం చేయబోతున్నారు. ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు కేసీఆర్ ఫామ్ హౌస్‌లో ఈ యాగం జరగనుంది. ఈ యాగానికి వైఎస్‌ఆర్ సీపీ అధినేత, వైఎస్ జగన్ ముఖ్య అతిథిగా రాబోతున్నారట.
అయితే చండీ మహాయాగానికి అప్పట్లో కేసీఆర్ కొంతమంది రాజకీయ ప్రముఖుల్ని ఆహ్వానించారు. అయితే.. ఇప్పుడు మాత్రం ఈ యాగంలో కేవలం కుటుంబ సభ్యులు, కేసీఆర్‌కు బాగా కావాల్సిన వాళ్లు మాత్రమే పాల్గొంటారు. ఇప్పటికే ఆహ్వానాలు కూడా వెళ్లిపోయాయి. ఇందులో భాగంగా… ఈ యాగానికి రమ్మని జగన్‌కు కూడా ఆహ్వానం వెళ్లింది. ఆయన కూడా వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారట. శృంగేరి జగద్గురువుల ఆశీస్సులతో శృంగేరి శారదాపీఠం సంప్రదాయంలో ఈ మహాయాగాన్నినిర్వహిస్తున్నారు.
మహారుద్ర సహిత సహస్ర చండీ మహాయాగానికి పీఠాధిపతులు - ధర్మాచార్యులు - స్వామిజీలు - అథ్యాత్మిక - థార్మికవేత్తలు - వేద పండితులు - ప్రముఖులు రాబోతున్నారు. మొదటి రోజు సప్తశతి చండీపారాయాణాలు నిర్వహిస్తారు. రెండో రోజు 200 - మూడో రోజు 300 - నాలుగో రోజు 400 పారాయాణాలు నిర్వహిస్తారు.ఇలా మొత్తం వెయ్యి పారాయాణాలు పూర్తి చేస్తారు. ఐదో రోజు ఏకాదశ యజ్ఞ కుండాల వద్ద వంద పారాయాణాలు,స్వాహకారాలతో హోమం నిర్వహిస్తారు. ఆ తర్వాత పూర్ణాహుతితో యాగం పరిసమాప్తి అవుతుంది. మహారుద్రయాగంలో నాలుగు రోజులూ రుద్ర పారాయాణాలు, చివరి రోజు రుద్ర హవనం పూర్ణాహుతి జరుగుతుంది.