కేసీఆర్ జిందాబాద్ అనేసిన కాంగ్రెస్ నేత‌లు

Update: 2017-04-27 12:58 GMT
తెలంగాణ‌లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌కు ఊహించ‌ని రివ‌ర్స్ పంచ్ ఎదురైంది. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ కు వ్య‌తిరేకంగా నిర‌స‌న తెల‌ప‌డానికి బ‌య‌లుదేరితే అందులో పాల్గొన్న వారు కేసీఆర్ జిందాబాద్ అంటూ నిన‌దించారు. దీంతో షాక్‌ తిన‌డం పార్టీ సీనియ‌ర్లు - మాజీ మంత్రుల వంతు అయింది. కొద్దికాలంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో ప్ర‌సూతి మ‌ర‌ణాలు పెరిగిపోయాయి. దీనిపై కాంగ్రెస్ పార్టీకి చెందిన మ‌హిళా విభాగం నిర‌స‌న‌కు సిద్ధ‌మైంది. మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ కార్యాల‌యానికి ర్యాలీగా బ‌య‌ల్దేరారు.

మాజీ మంత్రులు డీకే అరుణ - సునీతా లక్ష్మారెడ్డి - సబితా ఇంద్రారెడ్డి - మ‌హిళా కాంగ్రెస్ నేత‌లు సార‌థ్యం వ‌హించిన ఈ ర్యాలీ గాంధీ భ‌వ‌న్ నుంచి ప్రారంభం అవుతుండ‌గా ఇందులో ఉన్న మ‌హిళా నేత‌ల్లో ఒక‌రు ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదం ఇచ్చేందుకు సిద్ధ‌మ‌య్యారు. కేసీఆర్ అన‌గానే డౌన్ డౌన్ అంటార‌ని ఆమె ఆశించారు. అయితే సీన్ రివ‌ర్స్ అయింది. కేసీఆర్ అన‌గానే...ర్యాలీలో ఉన్న వారు జిందాబాద్ అనేశారు. దీంతో తేరుకున్న నాయ‌కులు సీఎం..అన‌గానే... జిందాబాద్ అనేశారు. దీంతో ర్యాలీలో పాల్గొన్న సీనియ‌ర్ నేత‌లు షాక్‌ కు గుర‌య్యారు. అనంత‌రం వారు స‌ర్దిచెప్పుకొని కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ ముందుకు సాగారు.

అనంత‌రం హెచ్ ఆర్‌ సీకి చేరుకున్న కాంగ్రెస్ మ‌హిళా నాయ‌కులు అక్క‌డ‌ ధ‌ర్నా నిర్వ‌హించారు.ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. ఈ సంద‌ర్భంగా పోలీసులు వారిచే ధ‌ర్నా నిలిపివేయించారు. అనంత‌రం హెచ్ ఆర్‌ సీ చైర్మ‌న్‌ కు కాంగ్రెస్ నేత‌లు విన‌తిప‌త్రం అందించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News