కొత్త మంత్రుల మాట.. ఏమన్నారంటే..

Update: 2019-02-19 07:04 GMT
తాను కలలో కూడా మంత్రి అవుతానని అనుకోలేదని మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి తెలిపారు. తనపై నమ్మకంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు క్యాబినెట్లో అవకాశం కల్పించడంపై ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనకు మంత్రి పదవే ఎక్కువని - కేసీఆర్ ఏ శాఖ అప్పగించినా విధేయతతో పని చేస్తానని - కేసీఆర్ బంగారు తెలంగాణ సాధనకు కృషి చేస్తానని మల్లారెడ్డి స్పష్టం చేశారు.

అదేవిధంగా కేసీఆర్ క్యాబినెట్ లో అవకాశం దక్కిన ఎమ్మెల్యే నిరంజన్ రెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేసీఆర్ తో కలిసి పని చేయడం ఎంతో అదృష్టమని అన్నారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తనకు మంత్రి పదవీ ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేశారు. కిందటిసారి స్వల్ప తేడాతో ఓడిపోయినా తనకు ప్రణాళికా సంఘం ఉపాధ్య పదవిని ఇచ్చారని.. ఆయనకు తాను ఎంతో రుణపడి ఉంటానని అన్నారు. తనకు ఏ శాఖ అప్పగించినా విధేయతతో పని చేస్తానని అభిప్రాయం వ్యక్తం చేశారు.

కేసీఆర్ క్యాబినెట్ లో మరోసారి అవకాశం రావడం సంతోషంగా ఉందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ బాధ్యత ఇచ్చినా సమర్థవంతంగా పని చేస్తానని స్పష్టం చేశారు. నల్లొండలో టీఆర్ ఎస్ జెండా ఎగిరేందుకు కృషి చేశానని గతంలో విద్యుత్ శాఖ మంత్రిగా పని చేశానని - ఆ శాఖ పట్ల సంతృప్తిగా ఉన్నట్లు తెలిపారు. కేసీఆర్ కు మంచి విజన్ ఉందని ఎవరికి ఏ బాధ్యత అప్పగించాలని ఆయన చాలా బాగా తెలుసని జగదీశ్వర్ రెడ్డి తన అభిప్రాయం వ్యక్తం చేశారు.


Tags:    

Similar News