పోలవరం ప్రాజెక్టు..ఒకప్పుడు గులాబీ దళపతి కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ రాష్ట్ర సమితి తీవ్రంగా వ్యతిరేకించిన అంశం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు పోలవరం ప్రాజెక్టుపై పోరాటం చేసిన కేసీఆర్ సుప్రీంకోర్టులో కేసు కూడా వేయించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు - నిజామాబాద్ ఎంపీ కవిత కూడా సుప్రీం కోర్టులో ఒక కేసు వేశారు. అయితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ ఎస్ వైఖరిలో పూర్తిగా మార్పు వచ్చింది. కేంద్రంతో ఎందుకు పేచీ అనే వరకు పరిస్థితులు మారిపోయాయని పలువురు విశ్లేషిస్తున్నారు.
పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఒకప్పుడు ఉద్యమించిన టీఆర్ ఎస్ ఇటీవల పూర్తిగా వైఖరి మార్చుకున్నట్టు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రం ఏర్పడకముందు పోరాటం చేసిన కేసీఆర్.... తెలంగాణ ఆవిర్భావం తర్వాత కూడా నిరసన తెలిపారు. తెలంగాణలోని పోలవరం ముంపు మండలాలను ఏపీలో విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మొదట కేసీఆర్ తప్పుపట్టారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తొలి సమావేశాల్లో ఈ మేరకు ఒక తీర్మానం కూడా చేశారు. కేంద్రం వైఖరిలో పెద్ద మార్పు లేకపోవడంతో పాటూ పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించడంతో ఇక తాము చేసేదేమీ లేదని భావించిన టీఆర్‌ఎస్ ఈ విషయంలో యూటర్న్ తీసుకుంది. ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని ఇటీవల ఢిల్లీలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. ఈ వాటా నీటిని కృష్ణా నదిలో వినియోగించుకునే వెసులు బాటును బచావత్ ట్రిబ్యునల్ ద్వారా ఎగువ రాష్ట్రాలకు కల్పించడంతో కొత్తగా ఏర్పడిన తెలంగాణకు కూడా వాటా కావాలని కేసీఆర్ ఇటీవల జరిగిన అపెక్స్ కౌన్సిల్ లో వాదించారు.
కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు విషయంలో దూకుడుగా ముందుకు పోతున్నందుకే కేసీఆర్ పంచాయతీ పెట్టుకోకుండా మధ్యే మార్గం ఆశ్రయించారని చెప్తున్నారు. కేంద్రం వైఖరిలో ఎలాంటి మార్పు లేదని స్పష్టంగా కనిపిస్తున్నపుడు ఇదే ఉత్తమ నిర్ణయమని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. అయితే కేసీఆర్ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. పోరాటానికి మారుపేరు అని చెప్పుకొనే కేసీఆర్ లో ఆ స్పూర్తి ఏమయిందని తెలంగాణ విపక్షాలు విమర్శిస్తున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/