తెలంగాణ రాష్ట్ర ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ లో రెండు భిన్నమైన పార్శాలు ఉంటాయి. ఆయన తెరిచిన పుస్తకంలా కనిపిస్తారు. అదే సమయంలో లోతైన వ్యూహాన్ని అమలు చేస్తుంటారు. ప్రతి ఒక్కరికి ఉండే బాలాలతో పాటు.. కొన్ని బలహీనతలు ఉంటాయి. ఎంతటి వారికైనా అవి కామన్. అలానే.. కేసీఆర్ కు అవి తప్పవు.
ఆయన ఎంత బలంగా వ్యూహాలు పన్ని.. పకడ్బందీగా అమలు చేసినా.. ఆయనలో ఉన్న బలహీనత ఆయన ప్రసంగంగా చెప్పాలి. ఆయన మైండ్ సెట్ ఎలా ఉందన్న విసయాన్ని అర్థమయ్యేలా తాజాగా నిర్వహిస్తున్న సభ చేస్తుందన్న మాట వినిపిస్తోంది. ముందస్తు ఎన్నికల వ్యూహంలో భాగంగా అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత మీడియా సమావేశాన్ని నిర్వహించటం..ఆ సందర్భంగా ఆయన చెప్పిన మాటల్లో ఆత్మవిశ్వాసం.. పవర్ తెచ్చిన అహంకారంతో పాటు.. తాను ఎలా డిసైడ్ చేస్తే.. యావత్ తెలంగాణలో అలా నడిచే పరిస్థితి ఉందన్న ధీమా ఆయన మాటల్లో కనిపించింది.
పేరుకు మీడియాతో సమావేశమనే కానీ.. మీడియాను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యల్ని చూసినప్పుడు ఆ మాటలకు ఆయన పరివారం సంతోషాన్ని వ్యక్తం చేసినా.. ఆయన మాటల్లో ఎటకారం వెనుకున్న పవర్ ధీమా ప్రజలకు స్పష్టంగా అర్థమైంది.
ఆసక్తికరమైన విషయం ఏమంటే.. టీఆర్ ఎస్ నేతలు.. కార్యకర్తలకు మాత్రం సదరు ప్రెస్ మీట్ లో కేసీఆర్ మాటల్లో హీరోయిజం కనిపించిందని గులాబీ వర్గాలు చెప్పుకున్నాయి. ఇక.. ఎన్నికల్లో వంద సీట్లకు తగ్గే ప్రసక్తే లేదన్న ధీమా కేసీఆర్ నోట వినిపించింది. ఆ ప్రెస్ మీట్ తర్వాత కేసీఆర్ బహిరంగ సభల్లో మాట్లాడింది తక్కువే.
వీలైనంతవరకూ ఫామ్ హౌస్ కు పరిమితమైనట్లుగా కనిపిస్తూ.. అక్కడినుంచే కథను నడిపిస్తున్న ఆయన.. తనకు బదులుగా తన కుమారుడు తాజా మాజీ మంత్రి కేటీఆర్ ను పంపటం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. మెట్రో రైలు ప్రారంభోత్సవానికి కానీ.. కొన్ని సభలకు కానీ తన కంటే తన కొడుకే ఎక్కువ ఫోకస్ కావాలని కేసీఆర్ కోరుకున్నట్లే జరుగుతున్నాయి.
ఇలా కేసీఆర్ కోరుకున్నట్లుగా సాగుతున్నా.. మరోపక్క ఆయన ఏ మాత్రం కోరుకోలేనట్లుగా విపక్షం బలపడటం.. కేసీఆర్ ప్రభుత్వ వైఖరి మీద వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతుందన్న వార్తలు గులాబీ బ్యాచ్ లో కలవరాన్ని రేపుతున్నాయి. దీని కారణంగానే.. టీఆర్ ఎస్ ముఖ్యనేతల నోటిలో నుంచి వస్తున్న తీవ్ర వ్యాఖ్యలుగా చెప్పాలి. ఇలాంటి వేళ.. ఈ రోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బహిరంగ సభలో పాల్గొంటున్నారు.
సుమారు 2 లక్షల మందిని సమీకరించాలన్న లక్ష్యంతో ఉన్నారు. సభ జరగనున్న గిరిరాజ్ కళాశాల మొత్తం 15 ఎకరాలుగా చెబుతున్నారు. దాదాపు వంద మంది వరకూ వేదిక మీద కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. కేసీఆర్ కోసం ప్రత్యేక హెలీప్యాడ్ ను సిద్ధం చేశారు. అనుకున్న రీతిలో భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యేలా మరో తాజా మాజీ మంత్రి పోచారం కష్టపడుతున్నారు. ఈ ఏర్పాట్ల సంగతి పక్కన పెడితే.. ఈ సభ ద్వారా కేసీఆర్ మైండ్ సెట్ ఎలా ఉందన్న విషయం అర్థముంతుంది.
కాంగ్రెస్.. బీజేపీ నేతల్ని భారీగా విమర్శించినా.. టీడీపీని ఉద్దేశించి ఎటకారం వ్యాఖ్యలు చేసినా.. తెలంగాణ ప్రయోజనాల్ని సీమాంధ్ర నాయకులు దెబ్బ తీశారన్న భావోద్వేగ మాటలు కానీ కేసీఆర్ నోటి నుంచి వచ్చాయంటే మాత్రం.. ఆయన విపరీతమైన ఆత్మరక్షణలో ఉన్నట్లుగా చెప్పాలి. తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి గొప్పలు చెప్పుకుంటే.. ఆయన తన గెలుపు మీద ధీమాతో ఉన్నట్లుగా చెప్పక తప్పదు. మొత్తంగా చూస్తే.. నిజామాబాద్ సభతో కేసీఆర్ మైండ్ సెట్ ఎంతో కొంత అర్థమవుతుందనే చెప్పాలి.