రాజకీయం అంత తేలికైన విషయం కాదు. దానికి చాలానే లెక్కలు ఉంటాయి. మనీ పవర్ తో పాటు.. మైండ్ గేమ్ చాలా ముఖ్యం. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో టీఆర్ఎస్ అధినేత.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చాలానే ఎన్నికల్ని చూసి ఉంటారు. కానీ.. ఆయనకు తొలిసారి మాత్రం చిత్రమైన అనుభవాన్ని హుజూర్ నగర్ ఉప ఎన్నిక పుణ్యమా అని చూడాల్సి వస్తోంది.
ఎన్నికల సంగతి ఎలా ఉన్నా.. ఉప ఎన్నికలతోనే తన రాజకీయ జీవితాన్ని అత్యుత్తమ స్థాయిలోకి వెళ్లేలా చేసుకున్నారు కేసీఆర్. అలాంటి ఆయన.. ఇప్పుడు అదే ఉప ఎన్నికతో కిందామీదా పడుతున్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైనప్పుడు టీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరైనా గెలుపు మీద ఎవరికి ఎలాంటి అనుమానాలు లేవు. కానీ.. రోజులు గడుస్తున్న కొద్దీ.. పరిస్థితుల్లో చోటు చేసుకున్న మార్పులతో ఇప్పుడు విజయం ఎవరి పక్షాన ఉంటుందన్నది ఒక పట్టాన తేలని పరిస్థితి.
పట్టు చిక్కిన తర్వాత పట్టు కోల్పోవటం కేసీఆర్ కు ఎప్పుడూ అలవాటు లేని అనుభవం. తొలిసారి ఆయన అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అంతేకాదు.. ఉప ఎన్నిక ఏదైనా.. పోలింగ్ జరిగే నాటికి పరిస్థితిని తన కంట్రోల్ లో ఉంచుకోవటం.. ఓటర్లను భావోద్వేగంలో ఉండేలా చేసే కేసీఆర్.. తాజాగా మాత్రం అలాంటిదేమీ చేయలేదు. ఎన్నికలు వస్తున్నాయంటే.. చాలా ముందుగా పోల్ మేనేజ్ మెంట్ కు సంబంధించిన ఏర్పాట్లు పక్కాగా చేయటం కేసీఆర్ కు అలవాటే.
అయితే.. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఆయన మేనేజ్ మెంట్ అనుకున్న రీతిలో లేదన్న మాట వినిపిస్తోంది. ఈసీ డేగ కన్ను నుంచి తప్పించుకోవటం టీఆర్ఎస్ నేతలకు తొలిసారి చాలా ఇబ్బందికరంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఓవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె.. మరోవైపు అనుకున్నరీతిలో హుజూర్ నగర్ లో ప్రచారం చేయలేకపోవటం.. తాను మాత్రమే కాదు.. తన కుమారుడు.. మేనల్లుడితో సహా కీలక నేతలు ఎవరూ ప్రచారం చేసేందుకు అనువైన వాతావరణం హుజూర్ నగర్ లో లేదంటున్నారు. ప్రతికూల పరిస్థితుల్లో సానుకూల ఫలితం కోసం ప్రయత్నిస్తున్న కేసీఆర్ కు రిజల్ట్ ఎలా ఉన్నా.. హుజూర్ నగర్ ఉప ఎన్నికను మాత్రం ఆయన ఎప్పటికి మర్చిపోరని చెప్పక తప్పదు.